అప్ డేట్ ఇచ్చిన సినిమాటోగ్రాఫర్ రత్నవేలు
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న కొత్త
సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇది ఎన్టీఆర్ కు 30వ చిత్రం. ఈ చిత్రం
తాజాగా రెండో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ లో కొన్ని హై ఓల్టేజ్
యాక్షన్ దృశ్యాలను ఎన్టీఆర్ పై చిత్రీకరించారు.
ఎన్టీఆర్ 30వ చిత్రం సెట్స్ పై ఇటీవల బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్
అడుగుపెట్టారు. ఎన్టీఆర్, సైఫ్ కాంబినేషన్లో వచ్చే సీన్లను రెండో షెడ్యూల్ లో
చిత్రీకరించినట్టు తెలుస్తోంది. సెకండ్ షెడ్యూల్ పూర్తయిందన్న విషయాన్ని ఈ
సినిమా ప్రధాన కెమెరామన్ రత్నవేలు వెల్లడించారు. ఇందులో ఎన్టీఆర్ యాక్షన్,
స్టయిల్ అద్భుతం అని పేర్కొన్నారు.