సోషల్ మీడియాలో చేసే ట్రోల్స్ పైన బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తీవ్ర ఆవేదన
వ్యక్తం చేశారు. సోషల్ మీడియా కారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత గోప్యతకు భంగం
వాటిల్లుతోందన్నారు. తాను కూడా వివిధ సందర్భాల్లో ట్రోల్స్ ను ఎదుర్కొన్నానని
చెప్పారు. తన తల్లి, కూతురు పైన ఓ వ్యక్తి అసభ్యకరంగా చేసిన వ్యాఖ్యలు తనను
ఎంతో బాధించాయన్నారు. ది రణవీర్ షోకు ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు. సోషల్
మీడియా వల్ల ప్రైవసీ లేకుండా పోతోందన్నారు. జీవితాలు నాశనమయ్యే పరిస్థితి
వస్తోందన్నారు.ఏదైనా మాట్లాడితే దానిని మరో రకంగా ఎడిట్ చేసి, తమకు ఇష్టం వచ్చినట్లు
రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఏం మాట్లాడాలన్నా తనకు భయం
వేస్తోందన్నారు. ఒక మాట మాట్లాడితే పదిహేను రకాలుగా దానిని ప్రచారం
చేస్తున్నారన్నారు. తనది పాతతరమని, అందుకే సోషల్ మీడియా ట్రోల్స్ తనను
బాధిస్తుంటాయన్నారు.