ఈ వారం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి తెలుగు .. తమిళ .. మలయాళ .. హిందీ సినిమాలు
రానున్నాయి. ఈ నెల 27వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో ‘దసరా’ సినిమా స్ట్రీమింగ్
కానుంది. మార్చి 30వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. నాని – కీర్తి
సురేశ్ జంటగా నటించిన ఈ సినిమా, థియేటర్ల నుంచి మంచి వసూళ్లను రాబట్టింది.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి మంచి రెస్పాన్స్
ను రాబట్టే అవకాశాలు ఉన్నాయి.అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 27వ తేదీ నుంచి ‘పత్తు తల’ తమిళ సినిమా స్ట్రీమింగ్
కానుంది. శింబు – ప్రియా భవాని శంకర్ జంటగా నటించిన ఈ సినిమా, మార్చి 30వ
తేదీన థియేటర్లకు వచ్చింది. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా వైవిధ్యభరితమైన
సినిమాగా నిలిచింది.

ఇక సోనీ లివ్ లో ‘తురముఖం’ అనే మలయాళ సినిమా ఈ నెల 28వ తేదీన స్ట్రీమింగ్
కానుంది. నివీన్ పౌలి .. జోజు జార్జ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి
రాజీవ్ రవి దర్శకత్వం వహించాడు. మార్చి 10వ తేదీన ఈ సినిమా థియేటర్లకు
వచ్చింది. ఇదే రోజున ‘జీ 5’లో ‘యూ టర్న్’ హిందీ మూవీ స్ట్రీమింగ్ కానుంది.