వెలగపూడి : ఆర్-5 జోన్ పరిధి ప్రాంతాల్లో ప్రజా చైతన్య యాత్ర చేపట్టాలని
అమరావతి రాజధాని రైతులు నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు అమరావతి ఐక్య కార్యాచరణ
సమితి పిలుపునిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి రాజధాని రైతులు కీలక
నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఆర్-5 జోన్ పరిధి ప్రాంతాల్లో ‘ప్రజా చైతన్య
యాత్ర’ చేపట్టాలని నిర్ణయించారు. కృష్ణాయపాలెం నుంచి నిడమర్రు వరకు పాదయాత్ర
చేయనున్నారు. ఈ మేరకు అమరావతి ఐక్య కార్యాచరణ సమితి పిలుపునిచ్చింది. సెంటు
భూమి పేరుతో అమరావతి విధ్వంసానికి కుట్ర జరుగుతోందని ఈ సందర్భంగా రైతులు
ఆరోపించారు.ఏమిటీ ఆర్5 జోన్? : రాజధాని బృహత్ ప్రణాళిక ప్రకారం ఇప్పటి వరకు 4 నివాస
జోన్లు ఉండేవి. మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధానిలో ఇంతవరకు ఆర్-1 (ప్రస్తుత
గ్రామాలు), ఆర్-2 (తక్కువ సాంద్రత గృహాలు), ఆర్-3 (తక్కువ నుంచి మధ్యస్థాయి
సాంద్రత కలిగిన గృహాలు), ఆర్-4 (హైడెన్సిటీ జోన్) పేర్లతో 4 రకాల నివాస
జోన్లు ఉండేవి. అయితే, రాజధానిలోని కృష్ణాయపాలెం, వెంకటపాలెం, నిడమర్రు,
కురగల్లు, మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలోని 967.25 ఎకరాలను నివాస ప్రాంతాలుగా
ప్రభుత్వం ప్రకటించింది. అందులోని 900.97 ఎకరాలను ఆర్-5 జోన్‌గా ఏర్పాటు
చేస్తూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. అయితే, ప్రభుత్వ నిర్ణయం సరికాదని,
జీవోను వ్యతిరేకిస్తూ అప్పట్లో రాజధాని రైతులు కోర్టుకు వెళ్లారు. కనీసం రైతుల
అభిప్రాయాలు తీసుకోలేదని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు
ఆదేశాలతో అధికారులు రాజధాని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. ప్రభుత్వ
నిర్ణయాన్ని మూకుమ్మడిగా రాజధాని రైతులు వ్యతిరేకించారు. తాజాగా దీనిపై ఆర్-5
జోన్ పరిధిలో ఉన్న ప్రజలను చైతన్య పరుస్తూ యాత్ర చేపట్టాలని నిర్ణయించారు.