విజయవాడ : ప్రభుత్వ సేవల్లో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి పారదర్శకతకు
పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ ప్రభుత్వ శాఖలోనూ అవినీతికి
తావు లేకుండా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఇటీవల
జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో సీఎం జగన్ పునరుద్ఘాటించారని రాజ్యసభ
సభ్యులు,వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
ట్విట్టర్ వేదికగా శనివారం ఆయన పలు అంశాలను వెల్లడించారు. ప్రభుత్వ సేవలు
ప్రజలకు అందించడంతో అవినీతి తావివ్వొద్దని, రిజిస్ట్రేషన్, టౌన్ ప్లానింగ్,
గ్రామ సచివాలయాల్లో అవినీతి లేకుండా చర్యలు చేపట్టాలని, అవినీతిపై ఎవరికి
ఫిర్యాదు చేయాలో సూచిస్తూ బోర్డులు పెట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ మేరకు
సాంకేతిక విధానాలపై దృష్టి సారించాలని, తద్వారా పన్ను చెల్లింపుదారులకు
మెరుగైన సేవలందించవచ్చని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిపారు.గణనీయంగా పెరిగిన దేశీయ విమాన ప్రయాణికులు : పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్
ట్రాఫిక్ నివేదిక ప్రకారం గత సంవత్సరంతో పోల్చుకుంటే దేశీయ విమాన ప్రయాణికుల
సంఖ్య 2023లో గణనీయంగా పెరిగిందని విజయసాయి రెడ్డి అన్నారు. 2022 జనవరి-
మార్చి మధ్య కాలంలో 247.23 లక్షలుగా ఉన్న విమాన ప్రయాణీకుల సంఖ్య 2023 జనవరి-
మార్చి మద్యలో 375.04 లక్షలుగా నమోదయ్యిందని అన్నారు. అలాగే 2019 మార్చిలో
93.5శాతం ఉన్న ఫిర్యాదుల పరిష్కారం 2023 మార్చిలో 99 శాతానికి పెరిగిందని
అన్నారు. 2023 జనవరి-మార్చిలో దేశీయ విమాన ప్రయాణీకులు సంఖ్య 51.7 శాతానికి
పెరగడంతో పాటు ప్రయాణీకులు పిర్యాదులు గణనీయంగా తగ్గడం మంచి పరిణామమని
అన్నారు. విమానయాన సంస్థలు ప్రయాణీకులు పిర్యాదులను జీరో స్థాయికి
తగ్గించేందుకు కృషి చేయాలని అన్నారు. అయితే వస్తువుల పిర్యాదులు, రిఫండ్
కంప్లయింట్స్ ఆందోళన కలిగిస్తున్న అంశమని ఆయన అన్నారు.