అగ్రశ్రేణి సంగీత దర్శకుడు తమన్ తన మంచి మనసును చాటుకున్నారు. తన ట్రూప్ లోని
ఓ సంగీతకారుడు క్యాన్సర్ తో బాధపడుతుండగా, అతడి కుటుంబానికి తమన్ రూ.10 లక్షల
ఆర్థిక సాయం అందించారు. ఈ విషయాన్ని ప్రముఖ గాయని గీతామాధురి వెల్లడించారు.
ఆహా ఓటీటీలో ప్రసారమయ్యే తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో తమన్
న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.ఈ కార్యక్రమంలోనే గీతామాధురి… తమన్ చేసిన సాయాన్ని అందరికీ తెలియజేశారు. తమ
మ్యూజిషియన్లలో ఒక కుర్రాడికి క్యాన్సర్ సోకిందని, అతడి ఫ్యామిలీ మెంబర్స్
కీమో థెరపీ చేయించారని గీతామాధురి వెల్లడించారు. అయితే బిల్లు కడితేనే అతడిని
డిశ్చార్జి చేస్తామని ఆసుపత్రి వర్గాలు చెప్పాయని, ఈ విషయం తమన్ గారికి
తెలియడంతో ఆయన వెంటనే రూ.10 లక్షలు అందించారని ఆమె వివరించారు.

కాగా, సామాజిక దృక్పథం ఉన్న తమన్ 100 మంది వృద్ధులకు ఆశ్రయం ఇవ్వగల ఓ
ఆశ్రమాన్ని గుంటూరు వద్ద నిర్మిస్తున్నారు. ఈ వృద్ధాశ్రమం త్వరలోనే ప్రారంభం
కానుందని తమన్ వెల్లడించారు.