రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఆయిల్ ఫామ్ రైతుల నుండి లక్షా 25వేల మెట్రిక్ టన్నుల ఆయిల్ ఫామ్(గెలలు)ఆయిల్ ఫెడ్ ద్వారా ఆయిల్ ఫామ్ రైతుల నుండి సేకరించినట్టు ఆయిల్ ఫామ్ పై వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి నిర్వహించిన సమీక్షలో అధికారులు మంత్రికి వివరించారు. ఆయా రైతులకు తగిన న్యాయం చేసే విధంగా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అదే విధంగా ఇంటర్నల్ ఆడిట్ నిర్వహణకు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.అనంతరం సుబాబుల్ పై మంత్రి అధికారులతో సమీక్షించి ఇందుకు సంబందించి రైతులకు కల్పించాల్సిన ప్రయోజనాలపై సంబంధిత అధికారులకు తగిన దిశానిర్దేశం చేశారు. ఈసమీక్షా సమావేశాల్లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య,ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, పిసిసిఎఫ్ వై.మదుసూధన్ రెడ్డి,ఆయిల్ ఫెడ్ ఎండి బాబూరావు, ఎపి వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి కంటనాధ్ రెడ్డి, మార్కెటింగ్ శాఖ కమీషనర్ ప్రద్యుమ్న తదితర అధికారులు పాల్గొన్నారు.