నటుడు మహేష్ బాబు వారం రోజులుగా జర్మనీలో పర్యటిస్తున్నాడు. ఆయన వెంట భార్య
నమ్రత, కుమార్తె సితార, కుమారుడు గౌతమ్ కూడా ఉన్నారు. జర్మనీలోని
బాడెన్-బాడెన్ లో బ్రెన్నర్స్ పార్క్ హోటల్ లో వీరు బస చేశారు. ఈ సమయంలో మహేష్
బాబు తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో (యువర్స్ ట్రూలీ మహేష్) చేసిన ఓ చిన్న పోస్ట్
కొంత మంది అభిమానులను కలవరానికి గురి చేసింది.డాక్టర్ హ్యారీ కోనిగ్ తో కలసి దిగిన ఫొటోని మహేష్ బాబు తన ఇన్ స్టా గ్రామ్
ఖాతాలో షేర్ చేశారు. దాని కింద ‘‘థ్యాంక్యూ డాక్టర్ హ్యారీ కోనిగ్! ఆరోగ్యం
మెరుగైన చేతుల్లో……’’ అని పోస్ట్ పెట్టాడు. దీంతో మహేష్ బాబుకి ఏమైంది?
అన్న సందేహం ఏర్పడింది. మహేష్ అస్వస్థతకు గురైతే హ్యారీ కోనిగ్ నయం చేశారా..?
డాక్టర్ సేవలను అభినందిస్తూ పోస్ట్ పెట్టారా? అన్నది చాలా మందికి అర్థం కాలేదు.

ఈ పోస్ట్ పై అభిమానుల్లో చర్చ మొదలైంది. డాక్టర్ హ్యారీ కోనిగ్ జర్మనీలో
ప్రముఖ నేచురోపతీ డాక్టర్. ముందస్తు వ్యాధి నివారణ ఔషధాలపై ఆయన పని
చేస్తుంటారు. బ్రెన్నర్స్ మెడికల్ కేర్ సెంటర్ కు హెడ్ గా వ్యవహరిస్తున్నారు.