పవన్ కల్యాణ్, రేణూ దేశాయ్ ల తనయుడు అకీరా నందన్ సంగీత దర్శకుడిగా వినోద
రంగంలోకి అడుగుపెడుతున్నాడు. ‘రైటర్స్ బ్లాక్’ అనే షార్ట్ ఫిల్మ్ కు అకీరా
సంగీతం సమకూర్చాడు. పూణేలో తల్లి రేణూ దేశాయ్ వద్ద పెరిగిన అకీరా బాల్యం నుంచి
సంగీతంలో ప్రత్యేక శిక్షణ పొందాడు. పియానోలో అకీరాకు మంచి పట్టు ఉంది.కాగా, తన కుమారుడు అకీరా తనకు ఇష్టమైన రంగంలోకి ప్రవేశించడం పట్ల రేణూ దేశాయ్
పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు. తనయుడు సంగీత దర్శకుడిగా ప్రస్థానం
ఆరంభిస్తున్న శుభవేళ తల్లిగా తన ఆశీస్సులు అందజేశారు.

“సూర్యకాంతిలోనూ మెరిసే వెలుగు చుక్కలా తనకంటూ ప్రత్యేక మార్గాన్ని ఎంచుకోవడం
ఎంతో సంతోషం కలిగిస్తోంది. నా చిన్ని తండ్రికి నా దీవెనలు. సంగీతంపై నీ ప్రేమ
ఈ ప్రయాణంలో నీకు ఎంతో ఆనందాన్ని, శాంతిని, బలాన్ని కలుగజేయాలని
ఆకాంక్షిస్తున్నాను” అని రేణూ దేశాయ్ ఇన్ స్టాగ్రామ్ లో స్పందించారు.
అంతేకాదు, రైటర్స్ బ్లాక్ షార్ట్ ఫిల్మ్ టైటిల్స్ లో మ్యూజిక్ డైరెక్టర్ అకీరా
నందన్ అనే కార్డ్ ను కూడా ఆమె ఓ వీడియో రూపంలో పంచుకున్నారు.