ఆర్ఆర్ఆర్ తో అంతర్జాతీయ స్థాయిలో నటుడిగా గుర్తింపు అందుకున్న జూనియర్
ఎన్టీఆర్ గత రాత్రి తన నివాసంలో స్పెషల్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ విందు
కార్యక్రమానికి అమెజాన్ స్టూడియోస్ ఉపాధ్యక్షుడు జేమ్స్ ఫర్రెల్ కూడా
హాజరయ్యారు. ఎన్టీఆర్ ఇంట జరిగిన ఈ ప్రత్యేక విందుకు రాజమౌళి, కొరటాల శివ,
త్రివిక్రమ్ శ్రీనివాస్, కొందరు అగ్రశ్రేణి నిర్మాతలు హాజరయ్యారు.కాగా, ఎన్టీఆర్ సన్నిహితుడు రామ్ చరణ్ ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్నందున ఈ
కార్యక్రమానికి హాజరుకాలేదని తెలుస్తోంది. ఈ విందుకు సంబంధించిన ఫొటోలను
ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

సాయంత్రం వేళ స్నేహితులు, శ్రేయోభిలాషులతో హాయిగా గడిచిపోయిందని ఎన్టీఆర్
ట్వీట్ చేశారు. జేమ్స్, ఎమిలీ ఈ విందుకు హాజరు కావడం సంతోషదాయకమని తెలిపారు.
ఇచ్చిన మాట ప్రకారం విందుకు హాజరైనందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు
పేర్కొన్నారు. అభిమానులను ఈ ఫొటోలు విశేషంగా అలరిస్తున్నాయి.