తన తల్లి తరంతో పోలిస్తే, తన వయస్సులో ఉన్న మహిళలకు తెరపై నటించేందుకు వైవిధ్యమైన పాత్రలను అందిస్తున్నందుకు సంతోషంగా ఉందని ప్రముఖ నటి రత్న పాఠక్ షా చెప్పారు. హిందీ చిత్ర పరిశ్రమలో మహిళా ఆర్టిస్టుల పరిస్థితి బాగా మారిందని దివంగత సినీ దిగ్గజం దినా పాఠక్ కుమార్తె రత్న పాఠక్ అమదోళన వ్యక్తం చేశారు. ‘‘ఈరోజు నాకు 65 ఏళ్లు. కానీ మా అమ్మకు ఇదే వయసులో ఉన్నప్పుడు , తనకు వచ్చిన పాత్రలన్నీ ఒకేలా ఉన్నాయని ఏడ్చేది. ఆమెతో పోల్చితే నాకు వైవిధ్యమైన పాత్రలు వస్తున్నాయి. నాలాంటి మహిళలు చాలా మంది ఉన్నారు. వారందరికీ అవకాశాలు రావాలి” అని షా అన్నారు.