మణిరత్నం డైరెక్షన్లో వస్తున్న పొన్నియిన్ సెల్వన్-2 సరికొత్త రికార్డ్
క్రియేట్ చేసింది. ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు
ఉన్నాయి. క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం ఎంతో కష్టపడి, ఇష్టపడి తెరకెక్కిస్తోన్న
పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ఏప్రిల్ 28న
ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్
బచ్చన్, విక్రమ్, త్రిష, కార్తీ, జయం రవి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమా రిలీజ్కు ముందే ఓ రికార్డ్ క్రియేట్ చేసింది.నాజర్, ప్రభు,
జయరామ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్,
మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఏఆర్ రెహమాన్
సంగీతం అందించారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా
విడుదల కానుంది.4DX ఫార్మాట్లో విడుదలయ్యే మొదటి దక్షిణ భారతీయ చిత్రంగా పొన్నియిన్
సెల్వన్-2 (PS-2) రికార్డ్ క్రియేట్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో
పాటు ఈ చిత్రాన్ని IMAX ఫార్మాట్లో కూడా విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
థియేటర్లో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వాలని నిర్ణయించుకున్నామని
అందుకే ఈ డెసిషన్ తీసుకున్నామన్నారు.