విజయవాడ : మహత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మన బీసీల అభ్యున్నతికి
కృషి చేస్తున్న మన అభినవ పూలే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి
రాష్ట్రంలోని 139 బిసీ కులాలకు మరింత సంక్షేమం అందించాలనే లక్ష్యంతో కులగణన
అధ్యయనం చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం. కుల
గణన చేపట్టడానికి మన బిసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస
వేణుగోపాలకృష్ణ తీసుకున్న చొరవ మరువలేనిది. దేశంలోనే అందరికంటే ముందుగా మన
రాష్ట్రంలోనే కులగణన చేయాలని, కులగణన చేపడుతున్న రాష్ట్రలకు వెళ్ళి అధ్యయనం
చేసేందుకు ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని మహాత్మ జ్యోతి రావు పూలే జయంతి
నాడు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవటం ఆ విషయాన్ని మన బిసీ సంక్షేమ శాఖ మంత్రి
ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నా మని సిద్దవటం యానాదయ్య పేర్కొన్నారు.