గాజువాక : జర్నలిస్టుల సమస్యల పరిష్కరానికి తాము శక్తివంచన లేకుండా పోరాటం
సాగిస్తామని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం
అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు అన్నారు. మంగళవారం గాజువాకలో ఆంధ్రప్రదేశ్
వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీనుబాబు
ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా తమ
కార్యవర్గం పనిచేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు
ఇప్పించేందుకు తమ ప్రయత్నాలు వేగవంతం చేశామన్నారు. తాజాగా ప్రభుత్వం దృష్టికి
తీసుకువెళ్లి ఇళ్ల స్థలాల సమస్యను ఎన్నికల ముందు పరిష్కరించాలని కోరామన్నారు.
అలాగే అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ సదుపాయం కల్పించాలని వినతిపత్రం
ద్వారా నివేదించామన్నారు. తమ వినతి మేరకు అక్రిడేషన్ల్లో కొన్ని సడలింపులు
ఇస్తూ జీవో జారీ చేయడం జరిగిందన్నారు. ఉమ్మడి విశాఖలో జర్నలిస్టుల
సంక్షేమమానికి తాను నిరంతరం సేవలందిస్తునే ఉంటారన్నారు. తన సేవలను గుర్తించి
జర్నలిస్టుల మిత్రులు ఎప్పటికప్పుడు ప్రోత్సాహకం అందిస్తున్నారని, వారికి
ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్లో కూడా తన సేవలు యధాతధంగా
కోనసాగుతాయన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజినేయలు, విశాఖ
అర్భన్ అధ్యక్షుడు పి.నారాయణ్, జాతీయ కార్యవర్గ సభ్యలు జి.శ్రీనివాసరావు,
బ్రాడ్కాస్ట్ అధ్యక్షుడు ఇరోతి ఈశ్వరరావు, పితాని సూర్యప్రసాద్, దవలేశ్వరపు
రవికుమార్, పరుశురామ్, ఎన్.రామకృష్ణ, పిళ్లా నగేష్ బాబు తదితరులు
పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాజువాక జర్నలిస్టుల సోదరులు శ్రీనుబాబును గజమాలతో
ఘనంగా సత్కరించారు.