బాపట్ల : పర్చూరు నియోజకవర్గంలో రేషన్ బియ్యం మాఫియాపై ఉక్కు పాదం మోపి,కట్టడి
చేయాలని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంటు అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి
సాంబశివరావు డిమాండ్ చేశారు. సోమవారం స్వర్ణ గ్రామంలో అక్రమ రేషన్ దందాపై
విజిలెన్స్ అధికారులు తనిఖీలు నేపథ్యంలో వారిపై కొందరు అక్రమార్కులు
దౌర్జన్యం చేసి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ఆయన స్పందించారు. కారంచేడు మండల
పరిధిలోని స్వర్ణ కేంద్రంగా అక్రమ రేషన్ మాఫియా దందా కొనసాగుతుందన్నారు.
అవినీతి అక్రమాలకు పాల్పడుతూ అధికారులపై దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ
అక్రమ రేషన్ బియ్యం వ్యాపారంతో నెల నెల కోట్ల రూపాయలు చేతులు
మారుతున్నాయన్నారు. స్వర్ణ గ్రామంలో సోమవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్
అధికారులు రైస్ మిల్లులో దాడులు నిర్వహించేందుకు రాగా వారిపై దాడికి దిగిన
సంఘటన మీడియాలో రచ్చయ్యాయన్నారు. గతంలోనూ ఈ రైస్ మిల్లు పై అనేకసార్లు
అధికారులు దాడులు నిర్వహించగా పలు మార్లు రేషన్ బియ్యం పట్టుబడటం
జరిగిందన్నారు.