వ్యాఖ్యలు చేశారు. నంది పురస్కారాలపై అనేక అపోహలు ఉన్నాయని, గ్రూపులు,
కులాలవారీగా పంచుకునేవారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో అవార్డుల పంపకాలు
అలాగే జరిగేవని ఆరోపించారు. అవార్డులు అనేవి కులం, మతం చూసి ఇవ్వకూడదని, నంది
అవార్డులు అలాగే ఇచ్చేవారని పోసాని కృష్ణమురళీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం ఏపీ ఫైబర్‌నెట్ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సందర్భంగా నిర్వహించిన
కార్యక్రమంలో పోసాని మాట్లాడారు. ‘‘దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ ఫైబర్
నెట్లో సినిమాలు చూసే అవకాశం ఏపీ ప్రభుత్వం కల్పిస్తోంది. ‘టెంపర్’లో నటనకు
గానూ కర్మకాలి నాకు అవార్డు ఇచ్చారు. తప్పక ఇవ్వని పరిస్థితుల్లో వేరే ఆప్షన్
లేక నాకు ఇచ్చారు. నేను కూడా వెళ్లి తీసుకున్నా. అసలు ఎవరెవరికి ఏయే అవార్డులు
ఇచ్చారో చూశా. అప్పుడు అవార్డుల కమిటీలో 11మంది ఒక వర్గం వారే ఉన్నారు. దీంతో
అవార్డులు ఇచ్చిన తీరు చూసి నాకు నచ్చక నాకు వచ్చిన దాన్ని కూడా వద్దని
చెప్పా. అవార్డులు అనేవి కులాలు, మతాలకు సంబంధం లేకుండా ఇవ్వాలి. తెలుగు
ఇండస్ట్రీని కులాలు, మతాలు కాదు శాసించేది. డబ్బు ఒక్కటే’’ అని అన్నారు.అది పోసాని వ్యక్తిగత అభిప్రాయం: ప్రసన్న కుమార్
నంది అవార్డులపై పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయమని
ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ అన్నారు. ‘అది ఆయన వ్యక్తిగత
అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన కార్యక్రమం కాబట్టి, పార్టీ పరంగా మాట్లాడి
ఉండవచ్చు. నంది అవార్డుల ఎంపిక అనేది చాలా పారదర్శకంగా జరిగింది. జాతీయ
అవార్డుల విషయంలోనూ ఇలాంటి కామెంట్స్ వినపడుతూనే ఉంటాయి. సినిమాలో దమ్ము ఉంటే
కులం, మతం, జాతి, ప్రాంతం అనేది చూడరు. అలాగే సొసైటీకి ఉపయోగపడే ఎలిమెంట్స్
ఉన్నాయా? అని చూసి ఇస్తారు. పోసాని కృష్ణమురళికి టెంపర్‌లో అవార్డు వచ్చిందంటే
ఆయన కులం, మతం చూసి ఇవ్వలేదు. ఆయన నటన చూసి ఇచ్చారు. అప్పుడు నంది అవార్డు
ఎంపిక కమిటీలో జీవితా రాజశేఖర్ ఉన్నారు. పరుచూరి బ్రదర్స్ గొప్ప రచయితలు.
వాళ్లు అసలు కులాన్ని పరిగణనలోకి తీసుకోరు. వారికి కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న
వ్యక్తులు. సినిమా ఇండస్ట్రీలో పనితీరునే పరిగణనలోకి తీసుకుంటారని
పేర్కొన్నారు.