డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే గేమ్
ఛేంజర్ అని ఈ చిత్రానికి టైటిల్ నిర్దేశించారు. దిల్ రాజు ఈ చిత్రానికి
నిర్మాత. ఈ మూవీ ప్రారంభమైనప్పటి నుంచి పలు మార్లు వాయిదా పడుతూ వస్తోంది.
షూటింగ్ భాగం దాదాపు సగం పూర్తయింది. కానీ శంకర్.. కమల్ హాసన్‌తో ఇండియన్-2తో
బిజీగా ఉండటంతో ఈ సినిమా ఆలస్యమవుతోంది. దీంతో సినిమా విడుదలపై అనిశ్చితి
నెలకొంది. తాజాగా నిర్మాత దిల్ రాజు చిత్రసీమలో తన 20 ఏళ్ల జర్నీ సందర్భంగా
మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనూ శంకర్-రామ్ చరణ్ మూవీ విడుదలపై
ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.గేమ్ ఛేంజర్ సినిమా విడుదల తేదీ గురించి స్పందించేందుకు దిల్ రాజు విముఖత
వ్యక్తం చేశారు. సరైన సమయంలోనే మూవీ విడుదలవుతుందని, ఆ విషయాన్ని అధికారికంగా
ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం గేమ్ ఛేంజర్
విడుదల విషయంలో మేకర్స్ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
వచ్చే ఏడాది సంక్రాంతికా లేదా వేసవిలో రిలీజ్ చేయాలా అనే అంశంపై వారు తర్జన
భర్జనలు పడుతున్నట్లు సమాచారం. దిల్ రాజు ఈ మూవీ విడుదల తేదీ ప్రకటించే లోపు
సంక్రాంతికి ఎన్ని భారీ సినిమాలు విడుదలవుతాయో వేచిచూడాలి.
ఇదిలా ఉంటే ఇండియన్-2 సినిమాను పూర్తి చేసేంతవరకు గేమ్ ఛేంజర్‌ను శంకర్ పక్కన
బెట్టారు. ఇండియన్-2 షూటింగ్‌ను జూన్ కల్లా పూర్తి చేసేలా ప్లాన్
చేసుకున్నారట. అప్పటికల్లా కేవలం ఒకే ఒక్క పాట చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్
ఉంటుందట. గేమ్ ఛేంజర్ విడుదల తేదీని మాత్రం ఇంతవరకు చిత్రబృందం ప్రకటించలేదు.
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన కియారా అద్వానీ
నటిస్తోంది. చెర్రీతో కియారాకు ఇది రెండో సినిమా. ఇంతకుముందు వినయ విధేయ రామలో
కలిసి నటించింది ఈ ముద్దుగుమ్మ. రామ్‌చరణ్-శంకర్ కాంబినేషన్ వస్తోన్న ఈ
సినిమాకు దిల్‌రాజు నిర్మాత. ఈ చిత్రం రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో
తెరకెక్కుతుందని సమాచారం. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు
తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇందులో చరణ్ రెండు విభిన్న సినిమాల్లో
కనిపిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రంలో సునీల్, అంజలి, జయరాజ్ తదితరులు కీలక
పాత్రలు పోషిస్తున్నారు