ఆరు దేశాల సమూహమైన గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్‌తో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి భారత్‌తో వచ్చే నెల నుంచి చర్చలు మొదలుపెట్టే అవకాశం ఉంది. ఇంటర్నెట్‌డెస్క్: ఆరు దేశాల సమూహమైన గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్‌తో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి భారత్‌తో వచ్చే నెల నుంచి చర్చలు మొదలుపెట్టే అవకాశం ఉంది. గల్ఫ్ ప్రాంతంలోని సౌదీ అరేబియా, యూఏఈ,కతర్,కువైట్,ఒమన్,బహ్రెయిన్లు ఈ గ్రూపులో సభ్యదేశాలు. ఇప్పటికే ఒప్పందానికి సంబంధించిన షరతులు తయారీ ప్రక్రియ తుదిదశకు చేరుకొందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారి ఒకరు తెలిపారు. జీసీసీ ప్రాంతంలో భారత్‌కు వాణిజ్య అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ ఒప్పందం కుదిరితే భారత్ ఎగుమతులు కూడా మరింత పెరగనున్నాయని నిపుణులు అంచనావేస్తున్నారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ డైరెక్టర్ రాకేష్ మోహన్ జోషీ మాట్లాడుతూ జీసీసీ మార్కెట్‌ను దేశీయ ఎగుమతిదారులు ఇంత వరకు దక్కించుకోలేదని పేర్కొన్నారు. ‘‘జీసీసీ దిగుమతుల ఆధారిత దేశాల సమూహం. మన దేశం నుంచి ఆహార పదార్థాలు, దుస్తులు, ఇతర వస్తువులను ఎగుమతి చేయవచ్చు. మన వస్తువులపై సంకాలు తగ్గితే అక్కడి మార్కెట్‌ను భారత్ చేజిక్కించుకొనే అవకాశం ఉంది. ఈ ఒప్పందం ఇరు వర్గాలకు ప్రయోజనకరంగా ఉంటుంది’’ అని జోషి తెలిపారు. భారత్ గల్ఫ్‌దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఇక ముత్యాలు, విలువైన రత్నాలు, లోహాలు, నగలు, విద్యుత్తు పరికరాలు, ఇనుము, ఉక్కు,రసాయనాలను ఈ దేశాలకు ఎగుమతి చేస్తోంది.