రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ : ఆడపడుచుల ఆర్థిక స్వావలంబనే కుటుంబ ప్రగతికి తొలి మెట్టు అని
ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.
60, 61 డివిజన్లకు సంబంధించి వాంబేకాలనీ హెచ్ బ్లాక్ నందు జరిగిన వైఎస్సార్
ఆసరా మూడో విడత సంబరాలలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్
సీపీ కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
తొలుత దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన
నివాళులర్పించారు. ఆడపడుచులతో కలిసి సీఎం జగనన్న చిత్రపటానికి క్షీరాభిషేకం
నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగర
డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి మాట్లాడుతూ టీడీపీ ఐదేళ్లు అధికారంలో
ఉన్నప్పటికీ డ్వాక్రా సంఘాల బకాయిలు చెల్లించకుండా, కేవలం ఎన్నికల ముందు
పసుపు-కుంకుమ పథకం పేరుతో తూతూమంత్రంగా చెల్లింపులు చేసిందన్నారు. చంద్రబాబు
మోసాన్ని గుర్తించిన అక్కచెల్లెమ్మలు 2019 ఎన్నికల్లో టీడీపీకి సరైన బుద్ధి
చెప్పారన్నారు. కార్యక్రమంలో సీడీఓ జగదీశ్వరి, కోఆప్షన్ సభ్యులు నందెపు
జగదీష్, నాయకులు బెవర నారాయణ, బత్తుల దుర్గారావు, నాళం బాబు, ఆర్.ఎస్.నాయుడు,
కోటేశ్వరరావు, ఫాతిమా, మీసాల బాలనాగమ్మ, పొదుపు సంఘాల మహిళలు పెద్దసంఖ్యలో
పాల్గొన్నారు.
విభిన్న ప్రతిభావంతులలో ఆత్మస్థైర్యం నింపేలా సంక్షేమ కార్యక్రమాలు అమలు
విజయవాడ : విభిన్న ప్రతిభావంతులలో ఆత్మస్థైర్యం నింపేలా ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు
అమలు చేస్తున్నట్లు ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే
మల్లాది విష్ణు అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా
డివిజన్లలో పర్యటించిన ఎమ్మెల్యేని ఉపకరణాల కోసం పలువురు దివ్యాంగులు
విన్నవించడం జరిగింది. స్పందించిన ఆయన విభిన్న ప్రతిభావంతుల, టి.జి. వయో
వృద్ధుల సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి ముగ్గురికి మూడు చక్రాల
సైకిళ్లు, ఒక వీల్ చైర్, నలుగురికి వినికిడి యంత్రాలు మంజూరు చేయించారు.
ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో మల్లాది విష్ణు చేతుల మీదుగా ఉపకరణాలను
అందజేశారు.
ప్రభుత్వంపై ఎల్లో మీడియా విషప్రచారం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన వర్క్ షాప్ కు
పచ్చమీడియా విపరీత అర్థాలు, వక్రభాష్యాలు చెబుతోందని మల్లాది విష్ణు
మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని రాష్ట్రంలోని 1.60 కోట్ల కుటుంబాలకు
వివరించాలని, ప్రతి తలుపు తట్టి సంక్షేమ పాలన గురించి వివరించాలని సీఎం
సూచించారన్నారు. పాలనాపరంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు అన్ని సామాజిక
వర్గాలు, ప్రాంతాల ప్రజల నుంచి పెద్దఎత్తున మద్ధతు లభిస్తున్నట్లు
వెల్లడించారు. కానీ జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై పచ్చమీడియా విషం చిమ్ముతోందని
ధ్వజమెత్తారు. పరిపాలన వికేంద్రీకరణ తమ ప్రభుత్వ విధానమని ఈ సందర్భంగా
పునరుద్ఘాటించారు.