అమరావతి : రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి
వైఎస్ జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం తాడేపల్లి ఆ పార్టీ
కేంద్ర కార్యాలయంలో ఆయనతో పాటు మంత్రి మేరుగు నాగార్జున, ఎమ్మెల్సీలు లేళ్ల
అప్పిరెడ్డి, ఏసురత్నం, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ‘జగనన్నే మా భవిష్యత్తు’
కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ ఏప్రిల్
7 నుంచి 20 వరకూ రాష్ట్రవ్యాప్తంగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం
జరుగుతుందని తెలిపారు.
7 నుంచి 20 వరకు ‘జగనన్నే మా భవిష్యత్తు’ : ఈనెల 7 నుంచి 20 వ తేదీ వరకు ‘జగన
న్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం జరగనున్నది. రాష్ట్రవ్యాప్తంగా 14 రోజులపాటు
జరిగే ఈ కార్యక్రమంలో 7 లక్షల మంది దాకా ప్రధాన కిందిస్థాయి కార్యకర్తలు మా
పదాధిదళంగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం సచివాలయ వాలంటీర్లు స్థానికంగా ఎంత
ఏరియా కవర్ చేస్తారో అంతే పరిధిలో గృహసారథుల వ్యవస్థ కూడా పనిచేస్తుంది.
వాళ్లమీద సచివాలయ కన్వీనర్ల వ్యవస్థతో పాటు మండల ఇన్ ఛార్జులు, వారిని
ఎప్పటికప్పుడు సమన్వయం చేసే జోనల్ కో ఆర్డినేటర్ల వ్యవస్థలు సైతం ‘జగనన్నే
మా భవిష్యత్తు’ కార్యక్రమంలో పూర్తిస్థాయిలో భాగస్వాములవుతారు. ఈ యంత్రాంగం
మొత్తం శాసనసభ్యులు, నియోజకవర్గాల సమన్వయకర్తల ఆధ్వర్యంలో నడుస్తోంది.
‘మా నమ్మకం నువ్వే జగన్’అనే నినాదంతో : ప్రజల నుంచి వచ్చిన ప్రధానమైన నినాదం
‘మా నమ్మకం నువ్వే జగన్..’. అందుకే ఈ నినాదాన్ని కూడా ‘జగనన్నే మా
భవిష్యత్తు’ కార్యక్రమంలో ఒక ప్రధాన అంశంగా పెట్టాం. ఈ నినాదమనేది మాకు మేముగా
అనుకున్నది కాదు. వైఎస్ జగన్ అధికారంలోకొచ్చాక ప్రజలకు ఏ విధంగా పరిపాలన
అందిస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వాల ఆలోచనలకు భిన్నంగా
ప్రజలకు జవాబుదారీతనంగా ఉండే లక్షణం రాజకీయ పార్టీలకు ఉండాలని, అలాగే ప్రజలతో
మమేకమై ప్రజల అవసరాలకు, అంచనాలకు అనుగుణంగా పాలన సాగించాలని, ప్రజల
జీవితాల్లో, వారి జీవనశైలిలో వచ్చిన మార్పును కళ్లకు కట్టినట్టు చూపించడమే మా
లక్ష్యం.
రియల్ ఛేంజ్ : ప్రజల జీవితాల్లో అనూహ్యమైన మార్పును తెస్తూ, బాధ్యతగా
సేవలందించడంలో అందరికంటే మేము ముందున్నాం. పార్టీ అజెండా రూపకల్పన
దగ్గర్నుంచి, మా పార్టీ విధానాలు.. సంక్షేమ పథకాలు అమలు తీరు.. ప్రజలకు
మెరుగైన పాలన అందిస్తున్న క్రమాన్ని అందరూ గుర్తించారు. ఈ విషయాన్ని మా పార్టీ
జనంలోకి వెళ్లినప్పుడు, గడపగడపకు మా ప్రభుత్వం కార్యక్రమం పేరిట ఎమ్మెల్యేలు,
సమన్వయకర్తలు ఇంటింటికీ తిరిగినప్పుడు.. సచివాలయాల ద్వారా వాలంటీర్లు
క్షేత్రస్థాయి నుంచి తీసుకొస్తున్న సర్వేల ద్వారా పరిశీలిస్తే.. దాదాపు 80
నుంచి 90 శాతం వరకు సమాజంలో ఒక రియల్ ఛేంజ్ (గుణాత్మకమైన మార్పు)
కనిపిస్తుందని నిరూపితమైంది. సీఎం జగన్పై ఏదైతే నమ్మకం పెట్టుకున్నామో..
దాన్ని ఒకటికి రెండింతలు నిలబెట్టుకున్నారని, అందుకనే సీఎంను మేమంతా
నమ్ముతున్నామని ఈ రోజు ప్రజలు చెబుతున్నారు.