విజయవాడ : స్థానిక 55వ డివిజన్ గాంధీ బొమ్మ సెంటర్ వద్ద సోమవారం 54,55,
డివిజన్ల లోని స్వయం సహాయక సంఘాల లోని అక్కా చెల్లెమ్మలకు వైఎస్ఆర్ ఆసరా పధకం
క్రింద మూడవ విడత రుసుము విడుదల కార్యక్రమం జరుగింది. ఈ కార్యక్రమానికి
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్
పార్టీ అధ్యక్షులు వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా పాల్గొని 178 స్వయం
సహాయక సంఘాల లోని 1780 మంది అక్కా చెల్లెమ్మలకు కోటి 31 లక్షల 54 వేల 7 వందల
39 రూపాయల విలువైన చెక్కు ను అందచేశారు అనంతరం ముఖ్యమంత్రి చిత్ర పటానికి
మహిళలతో కలిసి పాల అభిషేకం చేశారు అనంతరం వెలంపల్లి మాట్లాడుతూ గతంలో
చంద్రబాబు డ్వాక్రా మహిళలను మోసం చేశారన్నారు.బ్యాంకుల లో మహిళలకు చెడ్డ పేరు
వచ్చేటట్లు చేసిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. మహిళల్లో సంతోషం
చూడాలనే లక్ష్యంతో పని చేసే వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. మహిళల
పక్షపాతి జగన్ అని అన్నారు. కమ్యూనిష్టలది పసుపు జెండా అని అన్నారు.లక్షల
ఇళ్లు ఇస్తే తాత్కాలికామా అని ప్రశ్నించారు.చంద్రబాబు కి తోక పార్టీలు
కమ్యూనిస్టులు అని తెలిపారు.అన్ని పార్టీలు చంద్రబాబు కి
అమ్మడుపోయయన్నారు.అన్ని పార్టీలు కలిసి వచ్చిన జగన్ ఏమి చెయ్యలేరు అని సవాలు
విసిరారు.టచ్ చేసే స్థాయి అర్హత కూడా ఆ పార్టీలకు లేదన్నారు.ఇళ్ల కోసం పోరాటం
చేసిన కమ్యూనిస్టులు నేడు జగన్ మోహన్ చేసే సంక్షేమాన్ని స్వాగతించాలన్నారు. ఈ
కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు
అబ్దుల్ అర్షద్, శిరంశెట్టి పూర్ణచంద్రరావు క్లస్టర్ ఇంచార్జ్లు, సచివాలయ
కన్వీనర్లు,గృహ సారథులు, తదితర పార్టీ నాయకులూ కార్యకర్తలు, నగర పాలక సంస్థ
అధికారులు, స్వయం సహాయక సంఘాల అక్కా చెల్లెమ్మలు పాల్గొన్నారు.