కన్నడతో పాటు ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చూపెడుతున్న మూవీ ‘కాంతారా’. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ కన్నడతో పాటు తెలుగు, హిందీ సహా వివిధ భాషల్లో సంచలన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో కన్నడ హీరో రిషబ్ శెట్టి.. రజినీకాంత్‌ను ఆయన నివాసంలో కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సినిమా బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో హీరో రిషబ్ శెట్టి .. సూపర్ స్టార్ రజినీకాంత్‌ను ఆయన ఇంట్లో ప్రత్యేకంగా కలిశారు. కాంతారా మూవీ చూసిన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. అందులో రిషబ్ శెట్టి నటనకు ముగ్దుడయ్యారు. ఈ సందర్భంగా రిషబ్‌ను తన ఇంటికి ప్రత్యేకంగా ఆహ్వానించాడు. ఈ సందర్భంగా కాంతారా చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన రిషబ్‌ను ప్రశంసలతో ముంచెత్తారు తలైవా. ఈ సందర్భంగా రిషబ్ శెట్టి.. రజినీకాంత్ పాదాలను తాకి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. రజినీకాంత్ దగ్గర ఒక్కసారి ఆశీర్వాదం తీసుకుంటే.. వంద సార్లు తీసుకున్నట్టు అంటూ తన ఫేస్బుక్ పేజీలో రాసుకొచ్చారు.