గుంటూరు : అనకాపల్లి గరవపాలెం గ్రామంలోని శ్రీ గౌరీ గ్రంథాలయం ఆధ్వర్యంలో 80వ
వార్షికోత్సవం సందర్భంగా గ్రంధాలయాలు-సాంకేతిక పరిజ్ఞానం అంశంపై నిర్వహించిన
అవగాహన సదస్సులో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్, ఒంగోలు నియోజకవర్గ
పరిశీలకులు మందపాటి శేషగిరిరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ
రాష్ట్రాన్ని ఆధునికతతో కూడిన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకువచ్చి
యువత భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తున్న యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ,
విద్యకు ప్రాధాన్యత ఇస్తూ జగమంతా నిండిన విజ్ఞాన సంపత్తిని ఆంధ్ర రాష్ట్ర
ప్రజలకు డిజిటల్ లైబ్రరీల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వినియోగించేలా
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిజిటల్ గ్రంథాలయాల నిర్మాణం
చేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి సంకల్పానికి, దూరదృష్టికి యావత్
ఆంధ్రప్రదేశ్ జేజేలు పలకవలసిందేనని, అందుకే ఆయన విజనరీ జగన్ అని, ఈ తెలుగు
ఉగాదిని జగన్ డిజిటల్ శోభకృత్ నామ సంవత్సరం అంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో
కాండ్రేగుల వెంకటరమణ , దొడ్డి నూకసుబ్బారావు, పరమేశ్వరావు తదితరులు
పాల్గొన్నారు.