సోషల్ మీడియాలో ఫేమసైన జాంబీ ఏంజెలినా జోలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హాలీవుడ్ స్టార్ ఏంజెలినా జోలి రూపాన్ని పోలి ఉంటూ, బక్కచిక్కినట్లు, వింతగా కనిపించే ఈమె జాంబీ తరహాలో ఉండడంతో ఈమెను అందరూ జాంబీ ఏంజెలినా జోలీ పేరుతో పాపులర్ అయింది. అయితే ఆమె తాజాగా తన అసలు రూపాన్ని రివీల్ చేసింది. ఎట్టకేలకు తన అసలు ముఖాన్ని ప్రపంచానికి చూపెట్టింది. అది కూడా జైలు నుంచి విడుదలైన తర్వాత. జాంబీ ఏంజెలినా జోలీ పేరుతో పిలవబడుతున్న ఈమె పేరు సహార్ తబర్. ఇరాన్ కు చెందిన ఈమె దాదాపు 50 సర్జరీలు చేయించుకుందట. హిజాబ్ ధరించనందుకు, దైవ సంబంధిత విషయాల్ని హేళన చేసినందుకు అక్కడి ప్రభుత్వం ఆమెపై చర్యలు తీసుకుంది. సహార్పై పలు కేసులు నమోదు చేసి 2019లో పదేళ్ల కఠిన కారాగార జైలు శిక్ష విధించింది. కానీ జైలుకెళ్లిన 14నెలలకే ఆమెకు జైలు జీవితం నుంచి విముక్తి లభించింది. అందుకు కారణం ఆ దేశంలో ఇటీవల మహ్సా అమ్నీ మృతే. ఆమె మృతికి నిరసనగా వెల్లువెత్తుతున్న ఆందోళనలే. పలువురు సామాజిక కార్యకర్తలు సైతం సహార్ కోసం పోరాటం చేయగా.. ఆమెకు అక్కడి ప్రభుత్వం రిలీజ్ చేయక తప్పలేదు.
ముఖం, పెదవులు, ముక్కు..శరీరంలోని కొన్ని భాగాల్లో మొత్తం 50 వరకు సర్జరీలు చేయించుకున్నట్టు సహార్ స్వయంగా తెలిపింది. కానీ ఆ సర్జరీలు ఫెయిలయ్యాయని, అందువల్లే ఆమెకు ఆ వికృత ఆకారం ఏర్పడిందని చాలా మంది అభిప్రాయం. అయితే ఇటీవలే విడుదలైన సహార్.. తన నిజమైన ముఖాన్ని చూపించింది. తాను ఏంజెలినా జోలీలా కనిపించేందుకు ఏం చేసేదో వెల్లడించింది. తనకు తెలిసిన మేకప్ స్కిల్స్‌తోపాటు, కంప్యూటర్ స్కిల్స్ ఉపయోగించి తాను ఏంజెలినా జోలీలా కనిపించినట్లు వెల్లడించింది.
ఏంజెలీనా జోలీలా కనిపించేందుకు 50 సర్జరీలు చేయించుకున్నానని చెప్పి జైలుకెళ్లిన ఇరాన్ మహిళ విడుదలైంది మరియు లుక్ మేకప్ మరియు ఎడిటింగ్ ద్వారా చేసిన బూటకమని వెల్లడించింది.
ఇరాన్‌కు చెందిన సహర్ తబార్ 2019లో ఏంజెలిన్ జోలీలా కనిపించడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత అపఖ్యాతిని పొందింది, అయితే ఈ విధానాలు ఆమె పాపులర్ నటుడిలా చాలా మందమైన మరియు గగుర్పాటు కలిగించే వెర్షన్‌గా కనిపించాయి. ఆ సంవత్సరం తరువాత, ఇరాన్ యొక్క కఠినమైన దైవదూషణ చట్టాల ప్రకారం సహర్ని అరెస్టు చేసి పదేళ్లపాటు జైలులో ఉంచారు. 21 ఏళ్ల ఆమె ఇప్పుడు విడుదలైంది మరియు ఆమె ఇటీవల ఒక కొత్త ఇంటర్వ్యూలో తన అసలు ముఖాన్ని వెల్లడించింది.