ప్రపంచకప్ మ్యాచ్‌ల కోసం పాకిస్థాన్ జట్టు భారత్‌కు బదులు బంగ్లాదేశ్‌కు
వెళ్లనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గత వారం జరిగిన అంతర్జాతీయ
క్రికెట్ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనను పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీ
ముందుంచింది.ఈ ఏడాది జరగనున్న ఆసియా కప్‌లో స్టేడియాల విషయంలో హైబ్రిడ్ మోడల్‌ను
ప్రవేశపెట్టాలని ఐసీసీ యోచిస్తోంది. దానికి కారణం.. ఆసియా కప్ 2023కి
పాకిస్థాన్ ఆతిథ్యమివ్వడమే.. భారత జట్టు పాకిస్థాన్ వెళ్లేందుకు సిద్ధంగా
లేదు. దీంతో పాకిస్థాన్, భారత్ కాకుండా ఇతర దేశాల్లోనూ టీమిండియా మ్యాచ్‌లు
నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇటీవల దుబాయ్‌లో జరిగిన బోర్డు సైడ్ లైన్స్ సమావేశంలో ఈ ప్రతిపాదనను
ప్రస్తావించారు. పాకిస్థాన్ వేదికగా జరిగే ఆసియాకప్‌లో భారత్ పాల్గొనేలా
ఐసీసీ సమావేశంలో ఈ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
ఆసియా కప్ 2023పై స్పందిస్తూ, భారత జట్టు పాకిస్థాన్ కాకుండా వేరే దేశంలో
మ్యాచ్‌లను నిర్వహించాలని యోచిస్తున్నట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్
అంగీకరించింది. అయితే టీం ఇండియా పాల్గొనే క్రికెట్ మ్యాచ్‌లను ఏ దేశంలో
నిర్వహించాలనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం ఏసీసీ వద్ద ఉన్న సమాచారం
ప్రకారం దుబాయ్, ఒమన్, శ్రీలంక లేదా ఇంగ్లండ్‌లో భారత జట్టు ఆసియా కప్
మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. ఒకవేళ టీమ్ ఇండియా ఫైనల్స్‌కు వెళితే, ఆ ఫైనల్
మ్యాచ్ కూడా టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్ కాకుండా వేరే దేశంలో
జరుగుతుంది