హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 8వ తేదీన రాష్ట్రానికి రానున్నారు.
ప్రధాని రాకను పురస్కరించుకుని పలు రైల్వే అభివృద్ది కార్యక్రమాలను
ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్దమవుతోంది. తెలుగు రాష్ట్రాల మధ్య
సికింద్రాబాద్- తిరుపతి వరకు నడిచే రెండో వందేభారత్ రైలును అదేరోజు ప్రధాని
నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. దీంతో పాటు ఎంఎంటీఎస్ రెండో దశ పనులను,
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునఃఅభివృద్ది పనులను ప్రధాని చేతుల మీదుగా
ప్రారంభించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది.