లేదు. కొన్నేళ్ల క్రితం తనకన్నా చిన్నవాడైన నిక్ జోనాస్ ను ప్రేమించి పెళ్ళాడి
అమెరికా కోడలిగా మారిపోయింది. ప్రస్తుతం అమెరికా కోడలిగా సెటిల్ అయిన ఈ భామ
ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలతో బిజీగా మారింది. ఇక అప్పుడప్పుడు బాలీవుడ్ లో
మెరుస్తూ ఉంటుంది. ఈ మధ్యనే ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ వేడుకల్లో చరణ్, ఉపాసనతో
కలిసి కనిపించి ఆశ్చర్యపరిచింది.చరణ్ గురించి, ఆర్ఆర్ఆర్ గురించి ఇంత తెలిసినా.. మీడియా ముందు మాత్రం ఆమె
ఆర్ఆర్ఆర్ ను అవమానించింది. ప్రస్తుతం ప్రియాంక చేసిన వ్యాఖ్యలు నెట్టింట
వైరల్ గా మారాయి.
ఇటీవల ఆమె ఒక పబ్లిక్ ప్లాట్ ఫామ్ లో పాల్గొన్న ఆమెకు ఆర్ఆర్ఆర్ గురించిన
ప్రస్తావన వచ్చింది. ఆర్ఆర్ఆర్ ఒక బాలీవుడ్ సినిమా అని ప్రముఖ ఆంగ్ల చానెల్
వ్యాఖ్యాత డాక్స్ షెపర్డ్ అనగా.. తప్పు తప్పు..”ఆర్ఆర్ఆర్ ఒక గ్రేట్ తమిళ్
సినిమా.. అది మన అందరికీ అవెంజర్స్ సినిమా లాంటిది.” అంటూ చెప్పుకొచ్చింది. ఆ
ఒక్క మాట చాలదు.. అభిమానులు ఆమెను ఏకిపారేయడానికి.. ఆర్ఆర్ఆర్.. తమిళ్
సినిమానా.. కళ్ళు పోయాయా..? లేక అమెరికా వెళ్ళాకా.. కనిపించడం లేదా ..?
ఆర్ఆర్ఆర్ తెలుగు సినిమా. అన్నింటికి మించి బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ కాదు
అది ఒక ఇండియన్ సినిమా.. అది గుర్తుంచుకొని మాట్లాడు అని నెటిజన్లు ఆగ్రహం
వ్యక్తం చేస్తున్నారు. మొన్నటివరకు ఆర్ఆర్ఆర్ బాలీవుడ్ అన్నారు.. ఇప్పుడేమో
కోలీవుడ్ అంటున్నారు.. మరి ఇంకెప్పుడు ఈ సినిమా తెలుగు సినిమా అంటారు. వారందరు
తెలుగువారు అని ఎప్పుడు గుర్తిస్తారు అని ఇంకొందరు వాపోతున్నారు. ప్రస్తుతం ఈ
వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. మరి ఈ విషయమై ఆర్ఆర్ఆర్
టీమ్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.