తమ డిమాండ్ల సాధన కోసం 11 రోజులుగా సమ్మె చేస్తున్న హర్యానాలోని సఫాయి కర్మచారిలు ప్రభుత్వంతో నిర్వహించిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో తమ ఆందోళనను విరమిస్తున్నట్లు శనివారం సాయంత్రం కార్మికులు స్పష్టం చేశారు. హర్యానాలోని మున్సిపల్ ఉద్యోగుల సంఘం ప్రతినిధి బృందం ఇక్కడ పట్టణ స్థానిక సంస్థల మంత్రి కమల్ గుప్తా నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశమైంది. డిమాండ్లపై ఏకాభిప్రాయం కుదరడంతో సమ్మె విరమించినట్లు యూనియన్ ఒక ప్రకటనలో తెలిపింది.