ఎన్టీఆర్ శతజయంతి పండుగపై ప్రత్యేక దృష్టి
హైదరాబాద్ : ఎన్టీఆర్ శతజయంతి వేడుకల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు సహా
దేశ, విదేశాల్లో వంద సభలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది.
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు
అధ్యక్షతన సాగిన పొలిట్ బ్యూరో సమావేశంలో పార్టీ రెండు రాష్ట్రాల అధ్యక్షులు,
పొలిట్ బ్యూరో సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, ఎక్స్ అఫీషియో సభ్యులు
పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 17 అంశాలపై సమావేశంలో చర్చించి
పలు తీర్మానాలు చేశారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల నేపథ్యంలో రెండు తెలుగు
రాష్ట్రాలు సహా దేశ, విదేశాల్లో వంద సభలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ
నిర్ణయించింది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా
చంద్రబాబు అధ్యక్షతన చేపట్టిన పొలిట్ బ్యూరో సమావేశంలో పార్టీ మేనిఫెస్టో
రూపకల్పనను ప్రధాన అజెండాగా చర్చించడంతోపాటు మహానాడు నిర్వహణ, అకాల వర్షాలకు
నష్టపోయిన రైతులకు అండగా ఉండాలని, శాశ్వత సభ్యత్వం వంటి కీలక అంశాలపై
సమావేశంలో చర్చించి తీర్మానించినట్టు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. మొత్తం
17 అంశాలపై దాదాపు రెండు గంటల పాటు చర్చించిన అనంతరం మూడు ప్రధాన కమిటీలను
సైతం ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు.
మే నెలలో రాజమండ్రిలో టీడీపీ మహానాడు
హైదరాబాద్ : ఎన్టీఆర్ శతయంతి వేడుకల నిర్వహణపై ప్రధానంగా చర్చించినట్టు
పోలిట్ బ్యూరో సభ్యులు వివరించారు. ముఖ్యంగా మే 28లోపు రెండు తెలుగు
రాష్ట్రాల్లోని అన్ని నియోజకవర్గాలు, దేశ విదేశాల్లో తెలుగుదేశం అభిమానుల
ఆధ్వర్యంలో మొత్తం 100 సభలు నిర్వహించాలని తీర్మానించారు.
5వేల రూపాయలతో శాశ్వత సభ్యత్వం
తెలంగాణలో ఆవిర్భావ సభ నిర్వహణ సహా… అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు అండగా
ఉండాలని చర్చించినట్టు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్
తెలిపారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇంటింటికీ తెలుగు దేశం కార్యక్రమం వేగవంతం
చేయాలనే అంశాలపై చర్చించినట్టు స్పష్టం చేశారు. వీటితోపాటు పార్టీ సభ్యత్వ
నమోదు ప్రక్రియను వేగవంతం చేయడం, 5 వేల రూపాయలకు శాశ్వత సభ్యత్వం అందించాలని
తీర్మానించినట్టు వివరించారు