విమర్శనాస్త్రాలు సంధించారు. అదానీ కోసం కేంద్రం ఎంతకైనా దిగజారిపోతుందని
ఆరోపించారు. అదానీ కోసం మోదీ పాలసీ తీసుకువచ్చారని.. విమానాశ్రయాలు రాసి
ఇస్తున్నారని దుయ్యబట్టారు. విద్యుత్ ఛార్జీల ద్వారా ప్రజలపై భారం మోపేందుకు
యత్నిస్తున్నారని ఆయన ఆక్షేపించారు.కేంద్రంపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. శ్రీకాంతాచారి బలిదానం
గురించి తెలియనివారు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తల్లిని చంపి
బిడ్డను వేరు చేశారని ప్రధాని పార్లమెంటులో అన్నారని పేర్కొన్నారు. గుజరాతీల
చెప్పులు మోసే వారు రాష్ట్రంలో పుట్టడం దురదృష్టమని అన్నారు. పీక్ అవర్‌లో
విద్యుత్ ఛార్జీలు 20 శాతం పెంచాలని కేంద్రం ప్రతిపాదించిందని తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పెరుగుతున్న అవసరాలకు సరిపడా బొగ్గు దేశంలో ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. అదానీ
కోసం ఆస్ట్రేలియాతో ఒప్పందం చేసుకుంటారని ఆరోపించారు. విదేశీ బొగ్గును
కొనుగోలు చేసి దేశానికి రప్పించే కుట్ర జరుగుతోందని విమర్శించారు. తక్కువ ధరకు
వచ్చే బొగ్గును వదిలిపెట్టి.. 10 రెట్లు విలువైన బొగ్గు కొనుగోలు
చేస్తున్నారని అన్నారు. ఈ కొనుగోలును యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
వ్యతిరేకించారని తెలిపారు.
అదానీ కోసం ఎంతకైనా దిగజారిపోతున్నారు
బొగ్గు ధర పెరిగితే విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయని కేటీఆర్ చెప్పారు.
విద్యుత్ ఛార్జీల ద్వారా ప్రజలపై భారం మోపేందుకు యత్నిస్తున్నారని
వివరించారు. లాభాలు అదానీకి, చందాలు మోదీకి.. నష్టం ప్రజలకని వెల్లడించారు.
అదానీ కోసం ఎంతకైనా దిగజారిపోతున్నారని ఆరోపించారు. అదానీ కోసం మోదీ పాలసీ
తీసుకువచ్చారని.. విమానాశ్రయాలు రాసి ఇస్తున్నారని విమర్శించారు. ఒక సంస్థకు 2
విమానాశ్రయాల కంటే ఎక్కువ ఉండవద్దని గతంలో నిబంధన ఉందని.. అదానీ కోసం 6
విమానాశ్రయాలు రాసి ఇచ్చారని అన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు గండి కొట్టేలా
వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆక్షేపించారు.
కేంద్రం ఏం సాధించిందని బండి సంజయ్‌ను అడగాలి
విద్యా వ్యవస్థలో సిరిసిల్ల ముందుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ఏడాది
సిరిసిల్లకు వైద్య కళాశాల వస్తుందని తెలిపారు. కేంద్రం రాష్ట్రానికి ఒక్క
వైద్య కళాశాల, నవోదయ కళాశాల ఇవ్వలేదని ఆరోపించారు. యువతను బీజేపీ నాయకులు
ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. నాలుగేళ్లలో కేంద్రం ఏం సాధించిందని బండి
సంజయ్‌ను అడగాలని అన్నారు. సిరిసిల్లకు వైద్య కళాశాల, ఇంజినీరింగ్, నర్సింగ్
కళాశాల తీసుకొచ్చామని కేటీఆర్ వివరించారు.