రాహుల్ గాంధీకి అధికారుల నోటీసులు
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి పేరును అవమానించారన్న కేసులో
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి రెండేళ్ల శిక్ష పడిన సంగతి తెలిసిందే.
దీంతో ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని సైతం కోల్పోయారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం
కేటాయించిన అధికారిక భవనాన్ని ఖాళీ చేయాలని తాజాగా ఆయనకు నోటీసులు జారీ చేశారు
అధికారులు.
ఓ పరవునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీకి ఇప్పటికే రెండేళ్ల
జైలు శిక్ష విధించింది సూరత్ కోర్టు. దీంతో ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా
కోల్పోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులకు కేటాయించే అధికారిక
భవనాన్ని ఖాళీ చేయాల్సిందిగా తాజాగా రాహుల్‌కు నోటీసులు పంపారు అధికారులు.
కాగా, ప్రస్తుతం రాహుల్ ఉంటున్న అధికారిక నివాసాన్ని ఖాళీ చేసేందుకు నెలరోజుల
సమయం ఇచ్చారు లోక్‌సభ హౌసింగ్ కమిటీ అధికారులు. ఏప్రిల్ 22లోగా అధికారిక
బంగ్లాను ఖాళీ చేయాలని డెడ్‌లైన్ పెట్టినట్టు పార్లమెంట్ వర్గాలు
పేర్కొన్నాయి.
2004లో లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైన నుంచి దిల్లీలోని తుగ్లక్ లేన్‌లో 12వ
నంబరు బంగ్లాలో నివాసం ఉంటున్నారు. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వ
నివాస గృహంలో ఉండేందుకు రాహుల్‌ను అనర్హుడిగా పేర్కొంటూ లోక్‌సభ హౌసింగ్ కమిటీ
నోటీసులు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారంపై స్పందించిన రాహుల్ తరఫు
నాయకులు తమకు ఇంకా ఎటువంటి నోటీసులు అధికారుల నుంచి రాలేదని పేర్కొంది.ఇక
సూరత్ కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లేందుకు రాహుల్ గాంధీకి 30 రోజులు గడువు
ఇచ్చింది న్యాయస్థానం. కోర్టు తీర్పు వచ్చిన మరుసటి రోజే రాహుల్ గాంధీ
లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడంటూ లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ విడుదల
చేసింది. ఇలా ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోవడం వల్ల ఓ ప్రజాప్రతినిధికి లభించే
ప్రభుత్వ సదుపాయాలు, ఇతర ప్రయోజనాలు సైతం రద్దవుతాయి. ఈ కారణంతోనే అధికార
నివాసాన్ని ఖాళీ చేయాలంటూ అధికారులు నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. అయితే
కోర్టు తీర్పును సవాలు చేస్తూ పై కోర్టులను ఆశ్రయించే పనిలో ఉన్నారు రాహుల్
గాంధీ. ఇక్కడ గనుక ఆయనకు ఊరట లభిస్తే తప్ప.. ఏప్రిల్ 22లోపు తన అధికార
నివాసాన్ని ఖాళీ చేయక తప్పదు. మరోవైపు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా
గాంధీ భద్రతా సిబ్బందిని కూడా ప్రభుత్వం తగ్గించిన విషయం తెలిసిందే. ఈ
నేపథ్యంలోనే 2020 జులైలో తన అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు ప్రియాంక గాంధీ.
కాంగ్రెస్ సహా విపక్షాల మద్దతు
రాహుల్ గాంధీపై అనర్హతకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు
కొనసాగుతున్నాయి. అదానీ వ్యవహారంపై జేపీసీ విచారణ, రాహుల్ గాంధీపై అనర్హత వేటు
తదితర అంశాలపై పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ పార్టీ
మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీకి కాంగ్రెస్
అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ సహా టీఎంసీ, బీఆర్ఎస్, సమాజ్‌వాదీ, డీఎంకే,
వామపక్షాల నేతలు హాజరయ్యారు.