హైదరాబాద్ : బీజేపీపై రేవంత్‌రెడ్డి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
డబుల్ ఇంజిన్ అంటే ఒకటి అదానీ, రెండు ప్రధాని అని ఎద్దేవా చేశారు. అదానీ
ఇంజిన్‌కు రిపేరు వచ్చిందని, అందుకే ప్రధానికి భయం పట్టుకుందని ఆయన
ఆరోపించారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు. బ్రిటిష్ జనతా పార్టీ అని
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. విభజించు- పాలించు అనే
విధానాన్ని బీజేపీ అవలంభిస్తోందని దుయ్యబట్టారు. ఆర్ఎస్ఎస్ను వల్లభ్‌బాయ్
పటేల్ నిషేధించారని అన్నారు. దేశ సంపదను అదానీ సంస్థ కొల్లగొడుతోందని
విమర్శించారు. అదానీ పోర్టు నుంచి మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయని
పేర్కొన్నారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో నిర్వహించిన సంకల్ప సత్యాగ్రహ దీక్షలో
ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అదానీపై మాట్లాడినందుకే రాహుల్‌గాంధీపై అనర్హత వేటు
వేశారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాహుల్‌గాంధీని చూసి నరేంద్ర మోదీ
భయపడుతున్నారని విమర్శించారు. డొల్ల కంపెనీలలో అదానీ పెట్టుబడులు పెట్టారని
తెలిపారు. పెట్టుబడులపై ఈడీ విచారణ కోరినందుకే రాహుల్‌ను అడ్డుకున్నారని
అన్నారు. బీజేపీ నేతలు చాలామందిపై తీవ్రమైన నేర ఆరోపణలు ఉన్నాయని
వివరించారు.డబుల్ ఇంజిన్ అంటే ఒకటి అదానీ, రెండు ప్రధాని:బీజేపీ
ఎమ్మెల్యేలు, మంత్రులపై అనర్హత వేటు ఎందుకు వేయలేదని రేవంత్‌రెడ్డి
ప్రశ్నించారు. డబుల్ ఇంజిన్ అంటే ఒకటి అదానీ, రెండు ప్రధాని అని ఎద్దేవా
చేశారు. అదానీ ఇంజిన్‌కు రిపేరు వచ్చిందని.. అందుకే ప్రధానికి భయం పట్టుకుందని
ధ్వజమెత్తారు. భగత్‌సింగ్ వారసుడిగా రాహుల్ ఎవరికీ తల వంచరని.. క్షమాపణలు
చెప్పరని వ్యాఖ్యానించారు. మరో స్వాతంత్య్ర ఉద్యమం చేయాల్సిన బాధ్యత యువతపై
ఉందని వెల్లడించారు.