షర్ట్, బన్నీ హెయిర్ స్టైల్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. బన్నీ కొత్త హెయిర్
స్టైల్, ఆ రంగు చూసి అంతా ఆశ్చర్యపోతోన్నారు. కొంపదీసి పుష్ప రాజ్ ఈ
లుక్కులోకి మారిపోతాడా? ఏంటి? అని అనుకుంటున్నారు. బన్నీ కొత్త లుక్ మీద ఫన్నీ
మీమ్స్ కూడా పడుతున్నాయి.అసలే బన్నీ స్టైలింగ్, ఫోటో షూట్ల మీద నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్ జరుగుతుంది.
ట్విట్టర్, ఇన్ స్టాలో బన్నీ క్రేజ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. బన్నీకి
సంబంధించిన ఏ విషయం అయినా కూడా క్షణాల్లో నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతుంటుంది.
బన్నీ తాజా లుక్ సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇది సినిమా
కోసమా? లేదా క్యాజువల్‌గా లుక్‌ను మార్చాడా? అన్నది తెలియడం లేదు.
బన్నీ ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఏమీ ఉండటం లేదు. బన్నీ
వేస్తోన్న ట్వీట్లు సైతం ఎక్కువగా ట్రోలింగ్‌కు గురవుతున్నాయి. నాటు నాటు
పాటకు ఆస్కార్ రావడం, ఆ విషయం మీద బన్నీ ఆలస్యంగా స్పందించడం, ఆ ట్వీట్‌లోనూ
రామ్ చరణ్‌ను ఒకలా.. ఎన్టీఆర్‌ను ఇంకోలా పొగిడేశాడు. తెలుగు ప్రైడ్ అంటూ
ఎన్టీఆర్‌ను పొగడటంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.
బన్నీ ప్రస్తుతం సుకుమార్‌తో సినిమాను పూర్తి చేసిన తరువాత తన నెక్ట్స్
ప్రాజెక్ట్‌ను హిందీ ప్రొడక్షన్ కంపెనీలో సినిమా చేయాలని అనుకుంటున్నాడు.
అందుకే టీ సిరీస్‌తో సినిమా చేయబోతోన్నట్టుగా తెలిపాడు. సందీప్ రెడ్డి వంగా,
టీ సిరీస్, బన్నీ కలిసి ఓ సినిమాను చేయబోతోన్నారు. కానీ ఈ సినిమా ఎప్పుడు
స్టార్ట్ అవుతుంది.. అసలు కథ ఉందా? లేదా? అన్నది తెలియడం లేదు.