క్రికెట్ అభిమానులకు ఈ వేసవిలో సరైన వినోదం అందించేందుకు ఇండియన్ ప్రీమియర్
లీగ్ (ఐపీఎల్) మరి కొన్నిరోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నెల 31న ఐపీఎల్ తాజా
సీజన్ కు తెర లేవనుంది. కాగా, ఓపెనింగ్ సెర్మనీకి అహ్మదాబాద్ లోని నరేంద్ర
మోదీ స్టేడియం వేదికగా నిలవనుంది.ఈ ప్రారంభ వేడుకల్లో ఆస్కార్ విన్నింగ్ నాటు నాటు పాట సందడి చేయనున్నట్టు
తెలుస్తోంది. ఇంకా ఆసక్తి కలిగించే అంశం ఏమిటంటే… ఈ పాటకు జూనియర్ ఎన్టీఆర్,
రామ్ చరణ్ లైవ్ లో డ్యాన్స్ చేసే అవకాశాలున్నాయి. ఈ మేరకు సంప్రదింపులు
జరుగుతున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దీనిపై త్వరలోనే ప్రకటన
వెలువడనుంది.

అంతేకాదు, ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీలో అందాలభామలు రష్మిక మందన్న, తమన్నాల
ఆటాపాటా ఉంటాయని కూడా ప్రచారం జరుగుతోంది.
కరోనా సంక్షోభం ముగిశాక పూర్తిస్థాయిలో ప్రేక్షకుల నడుమ దేశవ్యాప్తంగా వివిధ
వేదికల్లో ఐపీఎల్ 16వ సీజన్ ను నిర్వహించనున్నారు. అందుకే, ప్రారంభోత్సవం
అదిరిపోయేలా ఉండాలని బీసీసీఐ పెద్దలు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.