పాల్గొన్న జర్నలిస్టు మిత్రులు
గుంటూరు : గుంటూరు నగరంలో సేవ్ జర్నలిజం డే నిరసన ప్రదర్శనలో జిల్లాలోని
జర్నలిస్టు పాల్గొని విజయవంతం చేశారు. నగరంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించి
, కొత్తపేటలోని భగత్ సింగ్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా
జర్నలిస్టు నాయకులు మాట్లాడుతూ దేశమాత స్వేచ్ఛ కోసం ధైర్యంగా ఉరి కంబాన్ని
ముద్దాడిన అమరవీరుడు సర్దార్ భగత్ సింగ్ ఆయన సహచరులైన రాజగురు సుఖదేవ్
ఆత్మబలిదానం చేసిన మార్చి 23న వారి పోరాట స్ఫూర్తితో సేవ్ జర్నలిజం డే
పాటించాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్, ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్
యూనియన్ పిలుపునివ్వడం జరిగిందన్నారు. పత్రికా రంగ అస్తిత్వాన్ని, మీడియా
స్వేచ్ఛను కాపాడుకోవటం కోసం జర్నలిస్టులు ఉద్యమాలు చేపట్టవలసిన పరిస్థితులు
ఏర్పడ్డాయన్నారు.అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ తోపాటు ఇళ్ల స్థలాలు
మంజూరు చేయాలని, లోకల్ కేబుల్ సిటీ కేబుల్, రన్నింగ్ కేబుల్ లాంటి సంస్థలో
పనిచేస్తున్న పాత్రికేయులకు అక్రిడేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని
డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాత్రికులపై జరుగుతున్న
దాడులను అరికట్టి, వృత్తి భద్రత హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ
కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే గుంటూరు జిల్లా అధ్యక్షులు ఎస్ ఎన్ మీరా,
కార్యదర్శి టి నాగిరెడ్డి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు పి
భక్తవత్సలరావు, ఏ కె మోహన్, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు ఏచూరి
శివ, ఐ జే యూ సభ్యులు ఏ.గిరిధర్ కుమార్, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు
నిమ్మ రాజు చలపతిరావు, జిల్లా కమిటీ నాయకులు కే రాంబాబు, ఎస్ నాగరాజు, పి
శ్రీనివాసరావు షరీఫ్ , చోప్పర సుధాకర్, మురళి, ఎస్ రాజా సాహెబ్, కె కోటి
రత్నం, పరస్యం నాయక్, అభిరామ్ రెడ్డి, వి ఎల్ నరసింహారావు, కరీం, గౌస్ బాషా,
కార్తీక్, మొగలయ్య, సుజి బాబు, సుభాని, పాములు, శ్రీనివాసరావు అప్పారావు,
తోపాటు పొన్నూరు ,తెనాలి, మంగళగిరి ,పత్తిపాడు, తాడికొండ ,గుంటూరు నియోజకవర్గం
నుండి పలువురు జర్నలిస్టులు పాల్గొని సేవ్ జర్నలిజం డే కార్యక్రమాన్ని
విజయవంతం చేశారు.