అమరావతి : గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు చట్టబద్ధత కల్పిస్తూ
రూపొందించిన ఏపీ గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల బిల్లు–2023కు శాసనసభ
ఆమోదం తెలిపింది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ సభలో
బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. దేశంలోనే
తొలిసారిగా రాష్ట్రంలో సచివాలయాల వ్యవస్థను ప్రభుత్వం తీసుకొచ్చిందని మంత్రి
సురేశ్ తెలిపారు. సచివాలయాల ద్వారా 500కు పైగా సేవలు ప్రజలకు గ్రామ, వార్డు
స్థాయిల్లోనే అందుతున్నాయన్నారు. ఇక సచివాలయాల బిల్లుతో పాటు మరో ఆరు
బిల్లులకు సభ ఆమోదం తెలిపింది.సభ ఆమోదం పొందిన ఆరు బిల్లులు ఇవే

♦ ఏపీ ఎస్సీ సబ్ ప్లాన్, ట్రైబల్ సబ్ ప్లాన్ (సవరణ) బిల్లు–2023
♦ ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ ఎస్టీ (సవరణ) బిల్లు–2023
♦ ఏపీ పబ్లిక్ సర్విసెస్ డెలివరీ గ్యారంటీ (సవరణ) బిల్లు–2023
♦ ఏపీ మున్సిపల్ లాస్ (సవరణ) బిల్లు–2023
♦ ఏపీ మున్సిపల్ లాస్ (రెండో సవరణ) బిల్లు–2023
♦ ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ (సవరణ) బిల్లు–2023