న్యూ ఢిల్లీ : కొత్త అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) ఏరియా
ఆఫీస్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత్ 6జీ విజన్ డాక్యుమెంట్‌ను, ‘కాల్ బిఫోర్
యు డిగ్’ యాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ గ్లోబల్
సౌత్ సమిట్‌ను భారత్ విజయవంతంగా నిర్వహించిందన్నారు. భారత్‌లో చాలామంది
ప్రజలు కొత్త ఏడాది వేడుకలను జరుపుకుంటున్నారని, ఈ శుభసమయంలో 6జి రీసెర్చ్
సెంటర్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. భారత్‌లో అతితక్కువ ధరకే డేటా
లభ్యమవుతోందని, గ్రామాల్లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగిందని
పేర్కొన్నారు. పట్టణాల కంటే గ్రామీణ ప్రజలే ఎక్కవగా ఇంటర్నెట్ను
వినియోగిస్తున్నారని తెలిపారు.దేశంలో 2 లక్షల గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ సేవలు అందాయని చెప్పారు. దేశంలో
బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు కూడా బాగా పెరిగారని ఈ సందర్భంగా తెలిపారు.
కాగా న్యూఢిల్లీలోని మెహ్రౌలిలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్
టెలిమాటిక్స్ (సీ-డాట్) భవనంలోని రెండో అంతస్తులో ఉన్న ఏరియా కార్యాలయాన్ని
ఏర్పాటు చేయడానికి 2022 మార్చిలో ఐటీయూతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. కొత్త
కార్యాలయం భారతదేశం, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు,
ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ లకు సేవలందిస్తుందని, దేశాల మధ్య సమన్వయాన్ని
పెంపొందించడం- ఈ ప్రాంతంలో పరస్పర ప్రయోజనకరమైన ఆర్థిక సహకారాన్ని
నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుందని ఒక ప్రకటనలో తెలిపింది.