ప్రవేశించింది. చివరి లీగ్ మ్యాచ్ లో యూపీ వారియర్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ 5
వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో
నిలిచి నేరుగా ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది.ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 138
పరుగులు చేసింది. తహ్లియా మెక్ గ్రాత్ 58 పరుగులతో అజేయంగా నిలిచింది.
కెప్టెన్ అలీసా హీలీ 36, శ్వేతా సెహ్రావత్ 19 పరుగులు చేశారు. ఢిల్లీ
క్యాపిటల్స్ బౌలర్లలో ఆలిస్ కాప్సే 3, రాధా యాదవ్ 2, జొనాసెన్ 1 వికెట్
తీశారు.
అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 17.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 142
పరుగులు చేసి విజయతీరాలకు చేరింది. కెప్టెన్ మెగ్ లానింగ్ 39, ఆలిస్ కాప్సే
34, మరిజేన్ కాప్ 34 (నాటౌట్), షెఫాలీ వర్మ 21 పరుగులతో జట్టు విజయంలో కీలక
పాత్ర పోషించారు.
ఈ టోర్నీలో మొత్తం ఐదు జట్లు పోటీపడగా, ఢిల్లీ క్యాపిటల్స్ 8 మ్యాచ్ ల్లో 6
విజయాలు, 2 ఓటములతో మొత్తం 12 పాయింట్లు సాధించి నెంబర్ వన్ గా నిలిచింది.
రెండో స్థానంలో ఉన్న ముంబయి ఇండియన్స్ కూడా 8 మ్యాచ్ ల్లో 6 విజయాలు
సాధించినా, రన్ రేట్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ పొజిషన్ లో నిలిచింది.
ఇక, మార్చి 24న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబయి, యూపీ వారియర్స్ జట్లు
తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తో
తలపడనుంది. డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచ్ మార్చి 26న ముంబయి బ్రాబోర్న్
స్టేడియంలో జరగనుంది.