లక్నో: సమాజ్‌వాదీ పార్టీ నేత, రాంపూర్ సదర్ ఎమ్మెల్యే ఆజంఖాన్ శాసనసభ్యత్వం రద్దయింది. యూపీ అసెంబ్లీ సెక్రటేరియట్ శుక్రవారం ఈ మేరకు ప్రకటించింది. విద్వేష ప్రసంగం కేసులో ఆజంఖాన్‌కు కోర్టు గురువారం మూడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. దాంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఫలితంగా రాంపూర్ సదర్ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించింది. రెండేళ్లు, అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడిన ఎమ్మెల్యే శాసనసభ్యత్వం రద్దవుతుంది. శిక్ష పూర్తయిన తర్వాత ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులవుతారు.