అమరావతి : ఏపీలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీడీపీ హయాంలో జరిగిన స్కిల్
స్కామ్‌పై చర్చ జరిగింది. ఈ క్రమంలో మంత్రి బుగ్గన, ఎమ్మెల్యే కన్నబాబు కీలక
వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో కన్నబాబు మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్
స్కాం ఓ దొంగల ముఠా కథ. డబ్బులు కొట్టేసే కార్యక్రమంలో టీడీపీ వాళ్లకు ఉన్న
స్కిల్ ఎవరికీ లేదు. నిరుద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసింది.
చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన నెలరోజులకే
ప్రతిపాదన తెచ్చారు. ప్రతిపాదన రాగానే కేబినెట్లో ప్రవేశపెట్టి ఆమోదించారు.
రూ. 3,356 కోట్ల ప్రాజెక్టుకు చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఏదైనా ప్రాజెక్ట్
ముందుకొస్తే డీపీఆర్ ఇవ్వాలి. డీపీఆర్ సిమెన్స్ కంపెనీ ఇవ్వకుండా ఇతరులు
ఇచ్చారు. కంపెనీ ఇవ్వకుండా ఇతరులు డీపీఆర్ ఎలా తయారు చేస్తారు. ఒక కంపెనీకి
ప్రభుత్వం రూ.3వేల కోట్లు ఖర్చు పెడుతుందా?. ప్రపంచంలో ఎక్కడా ఇలా
జరగలేదన్నారు. ఈ స్కాంలో నిందితులు ఎవరో తేల్చి త్వరగా చర్యలు తీసుకోవాలని
అన్నారు.