విజయవాడ పశ్చిమ : విజయవాడలో 58 వ డివిజన్ పరిధిలోని సి ఎన్ జి బంకు సమీపంలో ని
శ్రీ దేవీ కరుమారి అమ్మన్ శక్తి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కరుమారి దాసు
ఆధ్వర్యంలో జరగనున్న సహస్ర చండీ యాగానికి తన వంతు సహకారం అందిస్తానని ఎన్టీఆర్
జిల్లా తెదేపా ఉపాధ్యక్షులు బొమ్మసాని సుబ్బారావు హామీ ఇచ్చారు. శనివారం
పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కరుమారి దాసు గొల్లపూడి లోని బొమ్మసాని సుబ్బారావు
కార్యాలయంలో ఆయన్ని కలిసి చండీ యాగాయానికి రావాల్సిందిగా ఆహ్వానం పలికారు.
యాగం క్రతువుని గూర్చి వివరించారు.శ్రీ కంచికామకోటి పీఠాదీశ్వరులు
శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ
మహోత్తర యాగం శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానం (విజయవాడ) స్థానాచార్యులు
విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ తో నిర్వహిస్తున్నామని కరుమారి దాసు తెలిపారు. ఐతే
యాగం ప్రాంగణంలో 72 అడుగులు ఎత్తులో మహా చండీ మట్టి విగ్రహాన్ని ఏర్పాటు
చేస్తున్నామని 18 చేతులతో చండీ నిలువెత్తు దర్శనం కోసం భారీ సెట్టింగు ఏర్పాటు
చేస్తున్నామని ఆయన తెలిపారు. చండీ యాగం వివరాలు తెలుసుకొన్న బొమ్మసాని
సుబ్బారావు ఇంతటి మహా యాగంలో తాను పాల్గొంటానని అన్ని విధాలుగా సహాయ సహకారాలు
అందిస్తానని తెలిపారు బొమ్మసాని చేతులు మీదుగా చండీ యాగం కరపత్రాలు
ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతి కరుమారి దాసుతో పాటుగా శక్తి పీఠం
ట్రస్ట్ కోశాధికారి జ్ఞానేశ్వర్ సబ్యులు నీలకంఠరావు,శివ తదితరులు పాల్గొన్నారు.