భార్యతో కలిసి టీమిండియా-ఆసీస్ వన్డే మ్యాచ్ కు వచ్చిన రజనీకాంత్ మ్యాచ్ ను
ఆసక్తికరంగా చూశారు. ముంబయిలో ని వాంఖెడే మైదానంలో మ్యాచ్ జరుగుతుండగా భార్య
లతతో కలిసి వీఐపీ గ్యాలరీలో తలైవా కనిపించారు. ముంబయిలోని వాంఖెడే మైదానంలో
టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి వన్డే జరుగుతోంది. కాగా, ఈ మ్యాచ్ కు
దక్షిణాది సినీ సూపర్ స్టార్ రజనీకాంత్ తన అర్ధాంగి లతతో కలిసి వచ్చి మ్యాచ్
ను వీక్షిస్తూ టీవీ కెమెరాల కంటబడ్డారు. వీఐపీ గ్యాలరీలో కూర్చున్న రజనీకాంత్
దంపతులు ఆసక్తిగా మ్యాచ్ ను వీక్షిస్తూ కనిపించారు. అంతకుముందు, రజనీకాంత్
దంపతులకు ముంబయి క్రికెట్ వర్గాలు స్టేడియంలో సాదర స్వాగతం పలికాయి.