ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లో కీలకనేత గా ఎదిగిన రవికాంత్
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ పరిపాలనా కార్యదర్శి, కీలకనేత
నూతలపాటి రవికాంత్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆమేరకు పార్టీ
ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు
మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి రవికాంత్
దూరంగా ఉంటున్నారు. ఆ పార్టీకి అంటి ముట్టనట్లుగా ఉంటున్న ఆయన.. ఎక్కడా కూడా
పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం లేదు.
విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి గ్రామ, రాష్ట్ర మరియు
జాతీయ స్థాయిలో పలు రాష్ట్రాలలో వివిధ హోదాలలో పనిచేసారు. విభజన అనంతరం
రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించిన రవికాంత్ అనతి కాలంలోనే ఏపీసీసీ లో
కీలకనేతగా వ్యవహరించారు. విభజన అనంతరం రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు డా రఘువీరా
రెడ్డి తో కలిసి సుదీర్ఘకాలం పనిచేశారు. రఘువీరా అధ్యక్షుడిగా రాజీనామా చేసిన
తరువాత 8 నెలల అధ్యక్షుడి లేని కాలాన్ని సీనియర్ నాయకులతో సమన్వయ పరుచుకుని
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను నడిపించారు రవికాంత్. తదనంతరం శైలజానాథ్
అధ్యక్షుడిగా కలిసి సుదీర్ఘకాలం పనిచేసారు. ప్రస్తుత అధ్యక్షుడు రుద్ర రాజు తో
కలిసి కొద్దికాలం పనిచేసిన రవికాంత్ గత కొంతకాలం గా కాంగ్రెస్ పార్టీ
కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆకస్మికంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కి
రవికాంత్ గుడ్ బై చెప్పారు.