పరిశీలనలో పాల్గొన్న మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మీ, విజయవాడ నగర
మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేయ తలపెట్టిన అంబేద్కర్
స్మృతివనం, అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం పనులు విజయవాడ స్వరాజ్య
మైదానంలో వేగవంతంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు అంబేద్కర్
స్మృతివనం నిర్మాణ పనులను రాష్ట్ర మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి
అక్కడ జరుగుతున్న పనులను మంగళవారం పరిశీలించారు.
అంబేద్కర్ స్మృతివనం పనుల గురించి విజయవాడ నగర మున్సిపల్ కమిషనర్ క్యాంపు
ఆఫీసులో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ వై
శ్రీలక్ష్మీ తో విజయవాడ నగర మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
క్వాలిటీ కంట్రోల్ అధికారులు, ఏపీ.ఐ.ఐ.సీ. అధికారులు, కే.పి.సి. ప్రాజెక్ట్
కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ
125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహం నిర్మాణ పనులు వేగవంతం
అయ్యేందుకు,అంబేద్కర్ స్మృతివనం పనులు నాణ్యత పై సీఎం జగన్ ఆదేశాల మేరకు
మంగళవారం పనులు పరిశీలన చేసినట్లు ఆమె తెలిపారు. నాణ్యతా, ప్రమాణాలపై
కాంట్రాక్టర్ల కు సూచనలు చేయటం జరిగింది అని ఆమె అన్నారు. జూలై నాటికి
విగ్రహం పూర్తవుతుంది అని 72 రోజుల్లో మొత్తం పని పూర్తి చేస్తాం అని, మొత్తం
విగ్రహం విడిభాగాలు రావడానికి కొంత సమయం పడుతుందని ఒక ప్రొఫెసర్ పర్యవేక్షణలో
ప్రతీ చిన్న పని జాగ్రత్తగా క్వాలిటీ తో చేస్తున్నామని, కన్వెన్షన్ సెంటర్
నిర్మాణానికి సమయం పడుతుందని, ఒక రెస్టారెంట్, ఒక ఫాస్టుఫుడ్ సంస్థ సెంటర్, ఒక
థియేటర్, ఎగ్జిబిషన్ సెంటర్ కొత్తగా వస్తాయని, మ్యూజికల్ ఫౌంటెయిన్ కూడా
వస్తుందని ప్రత్యేక ఎస్టేట్ ఆఫీసర్ ఉండి ఒక ప్రత్యేక పరిపాలనా ఆఫీసు
వస్తుందన్నారు. బందర్ రోడ్ ఫుట్ పాత్ 4 కిలోమీటర్లు రెండు వైపులా అభివృద్ధి
చేస్తున్నామని, ఇండియా గేట్ లాంటి నిర్మాణం బందర్ రోడ్డులో చేయాలని ప్లానింగ్
చేస్తున్నమని పేర్కొన్నారు.