గుంటూరు : ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీకి చెందిన పలువురు నేతలు జనసేనలో
చేరారు. ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ సమక్షంలో తూర్పుగోదావరి జిల్లా
కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు
జనసేన కండువా కప్పుకొన్నారు. వారితో పాటు భీమిలి వైసీపీ నేతలు శ్రీచంద్ర
రావు, దివాకర్ తదితరులు పార్టీలో చేరారు. వాళ్లందరినీ పవన్ సాదరంగా
జనసేనలోకి ఆహ్వానించారు. టీవీ రామారావు 2009లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా
గెలుపొందారు. 2014, 2019ల్లో టీడీపీ టికెట్ రాకపోవడంతో గత ఎన్నికల్లో వైసీపీ
లో చేరారు. పార్టీకి అనుగుణంగా నడుచుకున్నా తగిన గుర్తింపు లభించలేదంటూ ఇటీవల
వైసీపీకి ఆయన రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో కొవ్వూరులో పార్టీ అభ్యర్థి
తానేటి వనిత (ప్రస్తుత హోం మంత్రి)ని గెలిపిస్తే ఆశించిన పదవి ఇస్తానని సీఎం
జగన్ అప్పట్లో చెప్పారని, తర్వాత కనీసం ఆయనను కలిసే అవకాశం కూడా రాలేదని
రామారావు చెప్పారు. కొందరికే పదవులు కట్టబెడుతున్నారని ఆయన ఆరోపించారు. పార్టీ
పదవి అయినా ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదన్నారు. తనను నమ్ముకున్న
కార్యకర్తలకు ఏమీ చేయలేకపోవడం బాధ కలిగిస్తోందని, అందుకే వైసీపీని వీడి
జనసేనలో చేరినట్లు తెలిపారు. ఈదర హరిబాబు 1994లో టీడీపీ తరఫున ఎమ్మెల్యే
గెలిచారు. ఆ తర్వాత 2014లో జడ్పీ ఛైర్మన్‌గానూ ఆయన పనిచేశారు. గత కొంతకాలంగా
రాజకీయాలకు దూరంగా ఉన్న ఈదర హరిబాబు ఇప్పుడు జనసేనలో చేరడం గమనార్హం.