చిత్తూరు : తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఉత్సాహంగా లోకేశ్ యాత్ర సాగుతోంది.
అంగళ్లులో లోకేశ్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. లోకేశ్ ను చూసేందుకు
స్వచ్ఛందంగా రోడ్లపైకి ప్రజలు, యువత, మహిళలు, వృద్ధులు తరలివచ్చి లోకేశ్ ను
కలిసి బాధలు చెప్పుకున్నారు. జై లోకేశ్ అంటూ టీడీపీ కార్యకర్తల నినాదాలతో
వెనక్కి తగ్గారు. నేడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చిత్తూరు
జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అంగళ్లలో నారా లోకేష్‌కి
టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. లోకేష్‌ని చూసేందుకు ప్రజలు
భారీగా రోడ్ల పైకి తరలివచ్చారు. లోకేష్‌ని కలిసి అంగళ్లు నిర్వహిస్తున్న
యువకులు, మహిళలు, వృద్ధులు తమ బాధలు చెప్పుకున్నారు. నిత్యావసర సరుకుల ధరలు
విపరీతంగా పెరిగిపోయాయంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్ బిల్లు ఎక్కువ
వచ్చిందని పెన్షన్ కట్ చేశారంటూ తమ బాధను లోకేష్ వద్ద పలువురు వృద్ధులు
వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక బెంగుళూరు వెళ్లి పనులు,
ఉద్యోగాలు చేసుకుంటున్నామని అంగళ్లు నిర్వహిస్తున్న యువకులు తెలిపారు.
ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ జగన్ పెట్రోల్, డీజిల్ పై వేస్తున్న
అసాధారణ పన్నుల వలనే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామన్నారు.
జగన్ అడ్డగోలుగా పెంచిన అన్ని పన్నులు తగ్గిస్తామన్నారు. పేద వాడిపై పన్నుల
భారం తగ్గిస్తామన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే అర్హులైన అందరికీ
పెన్షన్లు ఇచ్చి తీరుతామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి 100
రోజుల్లోనే పెద్ద కంపెనీలు రాష్ట్రానికి రాబోతున్నాయన్నారు. ప్రతి
నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏర్పాటు చేసి చిన్న, మధ్య తరగతి
పరిశ్రమలను ప్రోత్సహిస్తామని నారా లోకేష్ పేర్కొన్నారు.