శ్రీకాకుళం : అన్ని రాష్ట్రాల కన్నా మిన్నగా మహిళకు ఉజ్వల భవిష్యత్
అందించడానికి సీఎం వైఎస్ జగన్ నిర్విరామ కృషి చేస్తున్నరని జిల్లా వైఎసార్సీపీ
అధ్యక్షులు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. బుధవారం సాయంత్రం
జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో
పాల్గొని మాట్లాడారు. ఆడబిడ్డల రక్షణలో అందరికన్నా మిన్నగా జగనన్న ప్రభుత్వం
ఉందన్నారు. మహిళల అభ్యున్నతే ఏ సమాజం ప్రగతికైనా కీలకమైన కొలమానమని గుర్తించిన
దార్శనికుడు జగన్ అని చెప్పారు. అందుకే 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ
ఏపీలో అవతరించేలా నిర్ణయాలు తీసుకుని వాటిని పక్కాగా అమలుచేస్తున్నారని
అన్నారు. గర్భస్త శిశువు నుంచి పండు ముదుసలి వరకు ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ
చూపిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదన్నారు.
ఆడబిడ్డల రక్షణ కోసం అందరికన్నా మిన్నగా అడుగులు ముందుకువేశామని,
ఆపదలో ఉన్న ప్రతి మహిళకు దిశ యాప్ అండగా నిలుస్తోందని చెప్పారు. ప్రతీ
ఒక్కరూ ఆడ పిల్లలను గౌరవించాలన్నారు. మానవాళిలో సగభాగం మాత్రమే కాక,
అభివృద్ధిలోనూ అంతకు మించిన పాత్రను మహిళలు పోషిస్తున్నారన్నారు. 2019లో
అధికారం చేపట్టిన నాటి నుంచి మన ప్రభుత్వం మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ,
విద్య, ఉద్యోగ సాధికారతలపై దేశంలోని మరే ప్రభుత్వమూ పెట్టనంతగా దృష్టి
పెట్టిందని తెలిపారు. అమ్మ ఒడి, వైయస్ఆర్ ఆసరా, వైయస్ఆర్ చేయూత, 30 లక్షల
ఇళ్ల పట్టాలు-22 లక్షల ఇళ్ల నిర్మాణం, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి
దీవెన, వైయస్ఆర్ సంపూర్ణ పోషణ ..ఇలా ప్రతి పథకం ఆడబిడ్డల సంక్షేమం కోసమే
ఇస్తున్నామన్నారు. రాజకీయ పదవుల్లో కూడా చట్టాలు చేసి మరీ సగభాగం ఇచ్చింది మన
ప్రభుత్వమేనని గుర్తు చేశారు. జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు చింతాడ మంజు
అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఎం వి పద్మావతి,
మాజీ మంత్రి త్రిపురాన వెంకటరత్నం, డిసీఎంఎస్ చైర్ పర్సన్ చల్ల సుగుణ, జిల్లా
గ్రంథాలయ సంస్థ చైర్మన్ సువ్వారి సుగుణ, సుడా చైర్ పర్సన్ కోరాడ ఆశాలత,
ఇచ్చాపురం మున్సిపల్ చైర్ పర్సన్ పిలక రాజ్యలక్ష్మి, బల్లేడ పద్మావతి, వెలమ
కార్పొరేషన్ చైర్ పర్సన్ పంగ కృష్ణవేణి, శ్రీశయన కార్పొరేషన్ చైర్ పర్సన్
చీపురు రాణి, పొందర కార్పొరేషన్ చైర్ చైర్ పర్సన్ రాజాపు హైమవతి తదితరులు
పాల్గొన్నారు.