విజయవాడ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రరత్న భవన్ నందు మహిళా
దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో
వివిధ రంగాలకు చెందిన మహిళలకు సన్మాన సత్కారాలు నిర్వహించారు. మహిళా
దినోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు
మాట్లాడుతూ సమాజంలో స్త్రీ పాత్ర చాలా బాధ్యతతో కూడుకున్నదని, చాలా ప్రాముఖ్యత
వున్నదని అంటూ మహిళా అభివృద్ధి జరిగితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు.రాష్ట్ర కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ
స్త్రీ యొక్క శక్తీ దేశ అభ్యున్నతికి ఉపయోగపడుతోందని, కానీ దురదృష్టవశాత్తు ఆ
స్త్రీ ని సమాజంలో అవమానాలకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వివిధ
రంగాలలో నిష్ణాతులైన మహిళలకు ఈ సందర్భంగా అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, సుంకర
పద్మశ్రీ సన్మానించి సత్కరించారు. సభా ప్రారంభంలో కూచిపూడి నృత్యాలతో
చిన్నారులు సభికులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో సిద్దార్ధ మహిళా కళాశాల
డైరెక్టర్ విజయలక్ష్మి, డా.రెజీనా, హెడ్ కానిస్టేబుల్ టి.నిర్మల, ఆర్టీసీ
కండక్టర్ హేమలత, గాయకురాలు మల్లాది స్వాతి, రిటైర్డ్ నర్సింగ్ సూపర్ వైజర్
విజయకుమారి లతో పాటుగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరశెట్టి నరసింహరావు,
ఎపిసిసి లీగల్ సెల్ చైర్మన్ వి.గురునాధం, ఏఐసిసి సభ్యులు కొలనుకొండ శివాజీ,
మేడా సురేష్, రాష్ట్ర, జిల్లా, నగర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,
విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.