అందుకొని తెలుగుతో పాటు కన్నడ తమిళ్ భాషలలో కూడా వరుస సినిమాలలో నటించి సౌత్
ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. అలాగే బాలీవుడ్ లో కూడా
మంచి మంచి అవకాశాలు అందుకుంటుంది. ముఖ్యంగా పుష్ప సినిమా తర్వాత రష్మిక రేంజ్
బాగా పెరిగిపోయింది అని చెప్పవచ్చు. పుష్ప సినిమాలో శ్రీవల్లి గా గ్లామర్
పాత్రలో నటించిన రష్మిక ప్రేక్షకులను ఆకట్టుకొని పాన్ ఇండియా హీరోయిన్గా
గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఇటు సౌత్ సినిమాలతోనే కాకుండా అటు
నార్త్ లో కూడా మంచి మంచి అవకాశాలు అందుకుంటుంది.ఇలా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండే రష్మిక సోషల్ మీడియాలో కూడా చాలా
యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్
చేయడమే కాకుండా సినిమా విశేషాల గురించి కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
సోషల్ మీడియాలో రష్మిక హద్దులు చెరిపే అందాల విందు మరింతగా ఆకట్టుకుంటు తన
ఫాలోయింగ్‌ని పెంచుతున్నాయి. ఇలా ప్రస్తుతం ఇన్‌స్టాలో ఈ బ్యూటీకి దాదాపు 36
మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఇదిలా ఉండగా పుష్ప సినిమాకి ఇప్పటికీ విదేశాల్లో
మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా శ్రీవల్లి పాటకి దేశ విదేశాల్లోనూ రీమిక్స్
చేస్తూ, రీల్స్ చేస్తూ పోస్టులు పెడుతూ సినిమా పట్ల తమ అభిమానాన్ని
తెలియజేస్తున్నారు. కానీ ఓ అభిమాని చేసిన పనికి రష్మిక ఒక్కసారిగా ఎమోషనల్
అయింది. రష్మిక ఊహించని విధంగా ఆ అభిమాని సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి
ఆశ్చర్యపరిచాడు.
నా హృదయాన్ని కదిలించింది…
తాజాగా ఈ విషయం గురించి అభిమానులతో పంచుకుంటూ రష్మిక ఒక పోస్ట్ షేర్ చేసింది.
ఇటీవల ఓ అభిమాని రష్మిక ఓ ఫ్లవర్ బొకే గిఫ్ట్ ని పంపించాడు. అయితే బొకే
సీతాకోకచిలుకల డిజైన్‌లో ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. అంతేకాదు అందులో చిన్న
నోట్‌ని పంపించాడు. అందులో రష్మిక మందన్నాకి అని ఇంగ్లీష్, హిందీలో ఆమె
పేర్లు రాశాడు. ఇది ఆమెని అభిమానించే అభిమానుల్లో అత్యంత ప్రేమించే ఓ అభిమాని
అని పేర్కొన్నాడు. అయితే అది పంపించింది యూకే కి చెందిన వాళ్లు కాగా, అందులో
తన పేరు కూడా మెన్షన్ చేయలేదు . అదే ఇప్పుడు రష్మిక హృదయాన్ని కదిలించింది.
దీని గురించి స్పందిస్తూ” ఈ గిఫ్ట్ నా హృదయాన్ని కదిలించింది. ఇందులో పేరు
లేదు, కానీ ఇది ఎవరైనా వారిని నేను ఎప్పటికీ ప్రేమిస్తుంటాను. నువ్వు నిజంగా
నాలో సంతోషాన్ని నింపావు, బిగ్ టెడ్డీ బేర్ హగ్స్ టూ యూ` అని పోస్ట్ షేర్
చేసింది.