ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)
తొలి సీజన్ నేటినుంచి మొదలు కానుంది. తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో
ముంబై ఇండియన్స్ తలపడనుండగా.. ఈ నెల 26న ఫైనల్ జరుగనుంది. మొత్తం ఐదు జట్లు
పాల్గొంటున్న ఈ లీగ్‌లో 21 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. పురుషుల ఇండియన్
ప్రీమియర్ లీగ్ ఆధారంగా మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభించారు. ప్రపంచ పవర్
హౌజ్‌గా ఎదగాలని భారత్ కోరుకుంటున్నది. తొలి మ్యాచ్‌లో గుజరాత్
జెయింట్స్-ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. హర్మన్, స్మృతి మంధాన, షఫాలీ,
జెమీమా, రిచా ఘోష్‌లాంటి చిచ్చర పిడుగులతో పాటు మెగ్ లానింగ్, ఎలిస్
పెర్రీ, నాట్ స్కివర్, హీలీ, బెత్ మూనీ, ఎకెల్‌స్టోన్ లాంటి స్టార్లు
అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ఎదురుచూస్తున్నారు. ఉత్కంఠభరిత మ్యాచ్‌ల్లో
సత్తాచాటలేక మెగాటోర్నీల్లో విఫలమవుతున్న భారత ప్లేయర్లకు ఈ లీగ్ ఎంతగానో
ఉపకరించనుంది. తొలి సీజన్లో భాగంగా అన్ని మ్యాచ్‌లు ముంబైలోనే
నిర్వహించనున్నారు. మ్యాచ్‌లన్నీ రాత్రి 7.30 నుంచి ప్రారంభం కానుండగా..
తొలిమ్యాచ్ కోసం ఆరంభ వేడుకలు సాయంత్రం 5.30 నుంచే జరుగుతాయి. ఇందులో
బాలీవుడ్ హీరోయిన్లు కృతీ సనన్, కియారా అద్వానీతో పాటు పంజాబీ సింగర్
అమృత్‌పాల్ సింగ్ ధిల్లాన్ తమ ఆట, పాటలతో అలరించబోతున్నారు. ఆతరువాత రాత్రి
7.30 నుంచి అసలైన సమరం మొదలు కానుంది.